
Adipurush pre release event(Today tollywood news): అవును. తిరుపతికి అయోధ్యను తీసుకొస్తున్నారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో అయోధ్యను తలపించేలా భారీ సెట్ వేస్తున్నారు. ఆ మహావిష్ణువు రెండు అవతారాలను ఒక్కచోట ఆవిష్కరిస్తున్నారు. శ్రీరాముడి చరితను సినిమాగా చూపించబోతుండటంతో.. చినజీయర్ స్వామి స్వయంగా తరలివచ్చి ఆశీస్సులు అందించనున్నారు. ఆదిపురుష్ ఫంక్షన్‌కు చినజీయరే చీఫ్ గెస్ట్.
తిరుపతి శ్రీ వేంకటశ్వర యూనివర్సిటీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జరగబోతోంది ఈ ఈవెంట్. లక్షమంది వచ్చినా ప్రాబ్లమ్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 2 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్. డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
గ్రౌండ్‌లో సీటింగ్‌కు సైతం రామాయణంలోని పేర్లే పెట్టారు. వేదికకు ముందు వీవీఐపీలు కూర్చునే వరుసకు ‘అయోధ్య’ అని నామకరణం చేశారు. ఆ తర్వాత వీఐపీల కోసం కేటాయించే వరుసను ‘మిథిల’ అంటున్నారు. మూడో లెవెల్ ప్రేక్షకులకు ‘పంచవటి’ అని పిలుస్తున్నారు. ఇక చివర్లో ఉండే.. అసలు సిసలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు కేటాయించిన సీటింగ్‌ను ‘కిష్కింద’ అని పేరు పెట్టారు. కిష్కిందకాండ అంటే తెలుసుగా.. హనుమంతుడు లంకను ఆగమాగం చేసిన పర్వం. మాస్ ఆడియన్స్ చేసే కోతిచేష్టలకు సింబాలిక్‌గా ఆ పేరు పెట్టారా? అనే డౌట్.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసేందుకు ఏకంగా 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులను దించబోతున్నారు. ఆదిపురుష్ మూవీ సాంగ్స్‌తో పాటు రామాయణ గీతాలను వినిపించనున్నారు. డ్యాన్సులతో కనివిందు చేయనున్నారు.
ఇక, ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్‌ని కూడా ఈ ఈవెంట్‌లోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. రెండవ ట్రైలర్‌కి రాముడి విశ్వరూపం.. అంటూ ట్యాగ్ లైన్ పెట్టారని టాక్. ఇందులో లంకా దహనానికి సంబంధించిన విజువల్స్ ఎక్కువగా ఉంటాయని లీకులొస్తున్నాయి.
ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అతుల్ ముంబై నుంచి తిరుపతికి బైక్ మీద రావడం ఆసక్తికరం. ముంబైలో శనివారం స్టార్ట్ అయితే.. సోమవారానికి తిరుపతి రీచ్ అయ్యారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని.. స్వామి వారి పాదాలకు “జైశ్రీరామ్” పాటను సమర్పించారు.
ఇక, తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మునుపెక్కడా లేనట్టి.. 50 అడుగుల ప్రభాస్ హాలోగ్రామ్ ప్రదర్శించనుండటం షోకే హైలైట్ కానుంది.
ఆదిపురుష్ రిలీజ్ డేట్.. జూన్ 16.


