APBig Stories

Chandrababu: బీజేపీతో డీల్ అదేనా? ఆ ప్రతిపాదన నిజమేనా?

cbn shah nadda
cbn shah nadda

Chandrababu news today(AP political news): ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటకొచ్చారో అప్పటినుంచి చంద్రబాబుకు రాజకీయంగా ఏదీ కలిసిరావడం లేదనే చెప్పాలి. 2018లో బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చిన బాబుకు తెలంగాణలో ఘోర పరాభవం ఎదురైంది. ఇక అప్పటివరకు అధికారంలో ఉన్న ఏపీలో 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అక్కడ నుంచి రాజకీయంగా కోలుకోలేని పరిస్తితి. పైగా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వచ్చింది. ఇటు రాష్ట్రంలో జగన్‌కు పరోక్షంగా అండగా నిలుస్తూ వస్తోంది. దీంతో రాజకీయంగా బాబుకు బలపడలేని పరిస్థితి. ఈ క్రమంలోనే మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.

నెక్స్ట్ ఎలాగైనా ఏపీలో టీడీపీ గెలిచి తీరాలి లేదంటే.. పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో బాబు, పవన్‌ని కలుపుకున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ ఉంటే రాజకీయంగా తిరుగుండదని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ తో బీ‌జే‌పీని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేశారు. అవి వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా బాబు.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలని కలవడం సంచలనంగా మారింది. బీ‌జేపీని పొత్తుకు ఒప్పించడానికే బాబు ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. అయితే వారు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఎవరి ఊహాగానాలు వారికి ఉన్నాయి.

బాబు.. బీజేపీకి ఆఫర్ ఇచ్చారని, పొత్తు పెట్టుకోవాలని కోరారని అంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే సీట్లు వదిలేస్తే.. 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు. కానీ, అన్ని సీట్లు ఇస్తే తమకే నష్టమని బాబు భావిస్తున్నారని, బీజేపీకి ఏపీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితిలో ఓట్లు బదిలీ కావని చూస్తున్నారు.

మరో కథనం ప్రకారం బీజేపీ.. టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించిందని, తెలంగాణలో సహకారంతో పాటు, ఏపీలో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటోందని చెబుతున్నారు.

Related posts

PM Modi: ఫాంహౌజ్ కేసుపై వ్యూహాత్మక మౌనం?.. అందుకేనా మోదీ వార్నింగ్?

BigTv Desk

Pawan: ప్రాణభయంతో వైసీపీ ఎమ్మెల్యేలు.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్‌ కల్యాణ్‌

Bigtv Digital

Bandi Sanjay : 40శాతం ఓట్లు మావే.. కుంగిపోం.. పొంగిపోం..

BigTv Desk

Leave a Comment