BigTV English
Advertisement

Tomato : ట‌మాటా..పాల‌కూర క‌లిపి తింటే ఏమ‌వుతుంది?

Tomato : ట‌మాటా..పాల‌కూర క‌లిపి తింటే ఏమ‌వుతుంది?


Tomato : కొన్ని ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తింటే మ‌న‌కు ల‌భించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అధికం అవుతాయి. మ‌రికొన్నింటిని క‌లిపి తింటే దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి. మ‌రోవైపు ఏ ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాలు వాటిక‌వే ప్ర‌త్యేకం అని చెప్పాలి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే పోష‌కాలు ఎంతో అవ‌స‌రం అవుతాయి. అందుకే అన్ని ర‌కాల పోష‌కాల‌ను క‌లిపి తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. చిక్కుడు కూర, అన్నం కలుపుకొని తింటే వీటిలోని పోష‌కాల‌ను మ‌న శ‌రీరం తొంద‌ర‌గా గ్ర‌హిస్తుంది. తెల్ల అన్నంలో ఉండే అమైనో యాసిడ్లు శరీర కణజాల ఎదుగుద‌ల‌కు అవసరమైన ప్రొటీన్లను తొంద‌ర‌గా గ్రహిస్తాయి


. ఆకుకూరలు, టమాట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకు కూర‌లు చాలా ర‌కాల స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. బ‌చ్చ‌లి కూర‌, పాల‌కూర వంటి ఐర‌న్ ఎక్కువ‌గా ఉన్న ఆకుకూర‌ల‌ను ట‌మాటాతో క‌లిపి తింటే ర‌క్త హీన‌త ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది ఐరన్‌ను తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. వండిన‌టువంటి ఆకుకూర‌లు లేదా ఆకుకూర‌ల స‌లాడ్ల మీద నిమ్మ‌ర‌సం చ‌ల్లుకుని తిన్నా కూడా విట‌మిన్ సీ మ‌న శ‌రీరానికి ఎక్కువ‌గా అందుతుంది. అంతేకాకుండా ఆకు కూర‌ల్లో ఉండే ఐర‌న్‌ను కూడా మ‌న శ‌రీరం తొందర‌గా గ్ర‌హిస్తుంది.

గుడ్లు, జున్ను, ఒక గ్లాసు పాలు తాగితే మ‌న ఎముక‌లు బ‌లంగా ఉంటాయి. పాలు తాగితే ఎముకలు ఎంత బ‌లంగా ఉంటాయో గుడ్లు, జున్ను తింటే కూడా అంతే శ‌క్తి ల‌భిస్తుంది. మ‌న ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే విట‌మిన్ డి అవ‌స‌రం. గుడ్డు సొన‌లో విట‌మిన్ డి పుష్క‌లంగా ఉంటుంది. జున్నులో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. టమాట, ఆలివ్‌ ఆయిల్ లేకపోతే చాలా వంటలు అసాధ్యం.


టమాట సాస్‌, సూప్‌, పేస్ట్‌లలో ఎక్కువ‌గా లైకోపీన్‌ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా గుండె జ‌బ్బుల‌ను కూడా నివారిస్తుంది. పెద్దపేగులో వ‌చ్చే క్యాన్సర్‌ ప్రమాదాన్ని త‌గ్గిస్తుంది. టమాట సాస్ కానీ పేస్ట్‌ తిన్నప్పుడు ఆలివ్‌ ఆయిల్‌ కూడా కొంత జోడించుకుంటే లైకోపీన్‌ను శరీరం బాగా గ్రహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Related News

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Crocs: క్రాక్స్ ఎందుకంత ఫేమస్?.. దీని వెనుకున్న ముగ్గురి స్నేహితుల కథేంటి?

Mumbai Style Vada Pav: ముంబై స్టైల్ వడా పావ్ రెసిపీ.. క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు !

Big Stories

×