BigTV English

Ysrcp Roja: రోజా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. డీటేల్స్ బయటకు, రేపో మాపో నివేదిక

Ysrcp Roja: రోజా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. డీటేల్స్ బయటకు, రేపో మాపో నివేదిక

Ysrcp Roja: వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ‘ఆడుదాం ఆంధ్ర‘ ఆటల కార్యక్రమం స్కామ్‌గా మారిందా? టీడీపీ సభ్యులు కొత్తగా లేవనెత్తిన అంశాలేంటి? దీనిపై మంత్రి రాంప్రసాద్ ఏమన్నారు? అవినీతి చేసినవాళ్లను బయటపెడతారా? అవుననే సంకేతాలు ఇచ్చారు సదరు మంత్రి. సోమవారం సభలో అసలేం జరిగింది?


అసెంబ్లీలో మంత్రి వివరణ

ఏపీలో అసెంబ్లీలో సోమవారం ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంపై టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి రాంప్రసాద్ కీలక విషయాలు బయటపెట్టారు. ఆడుదాం ఆంధ్రా ప్రొగ్రాం కోసం వైసీపీ ప్రభుత్వం రూ. 119.19 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ఖర్చంతా కేవలం 47 రోజుల్లో పూర్తి చేశారని తెలిపారు.


ఖర్చు పెట్టిందిలా?

ఈ మొత్తాన్ని ఆర్ అండ్ బీ స్పోర్ట్స్ డిపార్టుమెంట్- జిల్లా కలెక్టర్లు ద్వారా ఖర్చు చేశారని వెల్లడించారు. ఖర్చు చేసిన వివరాలను బయటపెట్టారు సదరు మంత్రి. స్పోర్ట్స్ కిట్స్ కోసం రూ. 38.55 కోట్లు, టీ షర్టులు-క్యాప్స్ కోసం రూ. 34.02 కోట్లు, జిల్లా కలెక్టర్లు, స్పోర్ట్స్ అకౌంట్‌కు రూ. 40.93 కోట్లు డిపాజిట్ చేశారని వివరించారు. అందులో 21 కోట్ల రూపాయలను ఆప్ సైటింగ్ ఛార్జీలుగా ఉన్నాయని తెలిపారు.

ఫ్రైజ్ మనీ మాటేంటి?

ఇక ఫ్రైజ్ మనీ కోసం రూ. 12.21 కోట్ల ఖర్చు చేసినట్టు తెలిపారు. దీనిపై టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ శాఖ నుంచి తీసుకున్న రిపోర్టు ఆధారంగా కొన్ని విషయాలు బయటపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్రీడలు, క్రీడాకారులను ప్రొత్సహించడం మాత్రమేనని అన్నారు.

ALSO READ: పవన్ సీరియస్.. ఆ నేతపై చర్యలకు ఆదేశం

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టే కార్యక్రమమని తెలిపారు. కేవలం 47 రోజుల కార్యక్రమానికి దాదాపు రూ.120 కోట్లు ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందన్నారు అఖిల ప్రియ. ఆటగాళ్లు, ఆటలను ప్రొత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇచ్చిన కిట్స్ ఎలాంటి నాణ్యత లేదన్నారు.

పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై స్టిక్కర్లు వేశారన్నారు. నార్మల్‌గా అయితే గ్రామ, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఆటలను కండక్టర్ చేయాలన్నారు. వచ్చిన ఆటగాళ్లు ఆహారం, ట్రాన్స్ పోర్టు, సదుపాయాలు, గ్రౌండ్స్, కిట్స్ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేశారన్నారు. నిర్వహించిన ఆటల విషయానికొస్తే.. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీవాల్ (మెన్ అండ్ వుమెన్) నిర్వహించారని చెప్పారు.

ఇప్పటివరకు చేసిన ఖర్చు గురించి మాత్రమే మంత్రి చెప్పారని అన్నారు అఖిలప్రియ. ఎక్కడ అవినీతి జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్టులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. క్వాలిటీ లేని స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చారన్నారు. పబ్లిసిటీ దాదాపు రూ. 35 కోట్ల ఖర్చు చేశారని వివరించారు (స్టిక్కర్లు, హోర్డింగులు, సోషల్ మీడియా ప్రచారం) సదరు ఎమ్మెల్యే. గెలిచిన వారికి 12 కోట్లు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఆటగాళ్ల ఖాతాల్లో నిధులు పడలేదన్నారు.

విశాఖలో ముగింపు మాటేది?

విశాఖలో ముగింపు ఉత్సవాలకు రెండు నుంచి మూడు కోట్లు అదనంగా ఖర్చు చేశారని అఖిలప్రియ, గౌతు శిరీష వివరించారు. ముగింపు కార్యక్రమానికి అప్పటి సీఎం జగన్ రాలేదన్నారు. లేజర్ షోలు, ఫారెన్ నుంచి ఆర్టిస్టులు, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రైవేటు సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాలు 15,000 పార్టిసిపేట్ చేయగా, 35 లక్షల మంది ప్రేక్షకులు వచ్చినట్టు నివేదికలో ఉందన్నారు. 753 మండలాలు పాల్గొనగా దాదాపు 4 లక్షల మంది ప్రేక్షకులు వచ్చినట్టు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 90 వేలు మంది వచ్చినట్టు ఉందన్నారు. విశాఖలో నిర్వహించిన గేమ్స్ ఏమైతే ఉన్నాయో అందులో హాజరైనవారు ఎంతమంది ఉన్నారు? విన్నర్స్ ఎంతమంది? ఆధార్ కార్డు డీటేల్స్ ఏంటి? వారి ఖాతాలా డబ్బులు పడ్డాయా లేదా? అని ప్రశ్నలు లేవనెత్తారు.

శాప్ ఛైర్మన్‌ బాధ్యతలు తీసుకోకుండా ముందే గత రికార్డులు డిలీట్ అయినట్టు చెప్పారని గుర్తు చేశారు అఖిలప్రియ. ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.. శాప్ ఛైర్మన్ కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ, విజిలెన్స్ ఫిర్యాదు చేశామన్నారు. సీఐడీ ఒక్కరోజు మాత్రమే దర్యాప్తు చేసి ముగిందని ప్రముఖ దినపత్రికలో రాసిన విషయాన్ని వివరించారు.

మంత్రి వివరణ, స్పీకర్ సైతం

ఇది రూ. 120 కోట్ల స్కామ్ కాదని, రూ. 400 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పారు అఖిలప్రియ. చివరకు శిరీష్, అఖిలప్రియ అడిగిన ప్రశ్నలకు మంత్రి రాం ప్రసాద్ రిప్లై ఇచ్చారు. దీనిపై విజిలెన్స్, సీఐడీ కమిటీకి ఆదేశించామన్నారు. నివేదిక రాగానే సభలో ప్రవేశపెడతామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను వదిలేది లేదన్నారు.  అందరి పేర్లు బయటపెడతామన్నారు. ఈలోగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×