Constable Rape Preganant | రక్షించాల్సిన భటుడే భక్షకుడయ్యాడు. కాపాడమని వెళితే.. కీచక బుద్ధి చూపించాడు. ఆమె నిండు గర్భిణి అయినా, తనతో ఓ చిన్న పిల్లాడి తోడుగా ఉన్న కామంతో కళ్లు మూసుకుపోయి మృగంలా ప్రవర్తించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ నిండు గర్భిణిపై అత్యాచారం చేశాడు. ఆమెతో పాటు మూడేళ్ల పిల్లాడు ఉన్నా.. కనికరం చూపంచలేదు. బాధితురాలి భర్తకు ఈ విషయం తెలియగానే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి చెందిన 32 ఏళ్ల మహిళ గర్భవతి. ఆమెకు ఇంతకుముందే ఒక 3 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె భర్త ఓ చిరుద్యోగం చేస్తున్నాడు. అయితే ఆమె కుటంబ సభ్యులతో ఆస్తి గొడవల కారణంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆ గర్భవతి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్.. భాగారామ్ (48) ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లోనే ఉన్నాడు. దీంతో కానిస్టేబుల్ భాగారం ఆ గర్భవతిని స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు తన వెంట రావాలని చెప్పాడు. కానీ మహిళ భర్త తనకు ఆఫీసుకు వెళ్లాలని తనకు కుదరదని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ తన బైక్ మీద తీసుకువెళతానని చెప్పాడు.
Also Read: బిజేపీ నాయకుడికి 40 ఏళ్ల జైలు.. మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు..
కానిస్టేబుల్ భాగారామ్ చెప్పింది నమ్మి ఆ మహిళ తన మూడేళ్ల కొడుకుని తీసుకొని.. అతని బైక్ మీద వెళ్లింది. అయితే ఆమెను కానిస్టేబుల్ భాగారామ్ ఒక లాడ్జింగ్ కు తీసుకెళ్లాడు. అక్కడ లాడ్జింగ్ సిబ్బందితో తన వెంట ఉన్న గర్భవతి మహిళ బట్టలు మార్చుకోవాలని.. అందుకోసం కాసేపు ఒక గది ఇవ్వాలని అడిగాడు. అలా లాడ్జింగ్ లో ఒక గది తీసుకొని.. లోపలికి ఆమెను తీసుకెళ్లి.. ఆమెను బలాత్కరించేందుకు ప్రయత్నించాడు. దీంతో షాకైన ఆ మహిళ.. ప్రతిఘటించగా.. ఆమె భర్తను జైల్లో పెడతానని.. ఆమె కొడకుని చంపేస్తానని కానిస్టేబుల్ భాగారామ్ బెదిరించాడు.
అతనిలోని రాక్షసత్వానికి ఆమె భయపడిపోయింది. పక్కనే తన కొడకు ఉన్నాడని చెప్పినా.. ఆ కానిస్టేబుల్ పట్టించుకోలేదు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే ఆమె భర్తను జైల్లో పెడతానని బెదిరించి వెళ్లాడు. అయితే బాధితురాలు తనపై జరిగిన అన్యాయం గురించి తన భర్తకు చెప్పకొని వాపోయింది. ఆమె భర్త నేరుగా సమీపంలోని సంగానేర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ భాగారామ్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ భాగారామ్ తన భార్యపై తన మూడేళ్ల కొడుకు ఎదుటే అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం స్థానిక మీడియా రావడంతో సంచలనంగా మారింది. దీంతో ఈ కేసుని సంగనేర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పొలీస్ వినోద్ కుమార్ శర్మ టేకప్ చేశారు. ముందుగా బాధితురాలికి వైద్య పరీక్షల కోసం పంపించామని, నిందితుడు కానిస్టేబుల్ భాగారామ్‌ని అరెస్ట్ చేశామని చెప్పాడు.
అయితే ఈ కేసు స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరగడంతో మహిళా సంఘాలు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాజధానిలో పైగా ముఖ్యమంత్రి నియోజకవర్గం స్వయంగా పోలీసులే మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఈ కేసులో డిప్యూటి కమిషనర్ అయిన మహిళా ఐపిఎస్ ఆఫీసర్ తేజస్విని గౌతమ్ ని కూడా విచారణాధికారిగా నియమించారు.