E-Paper
Advertisement

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!
Advertisement

Vikram-1 Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చరిత్రలో ఈరోజు ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ స్వయంగా రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ మరికొద్ది సేపట్లో నింగిలోకి దూసుకెళ్లింది.

కౌంట్‌డౌన్ ప్రారంభం.. ప్రయోగానికి సర్వం సిద్ధం

Advertisement

‘ది మిషన్ ఆగమన్’ అనే పేరుతో చేపడుతున్న ఈ చారిత్రాత్మక ప్రయోగానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపారు. ఇందుకోసం ఉదయం 6 గంటలకే కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపంతో 4.59 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ఆగిపోవడంతో తిరిగి కౌంట్ డౌన్ ప్రారంభించారు.  తిరిగి ఈ ప్రయోగాన్ని 12: 05 గంటలకి శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్ నింగి వైపు ప్రయాణించింది.

రాకెట్ సామర్థ్యం.. ప్రత్యేక పేలోడ్స్ ఇవే!

Advertisement

సుమారు 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి తీసుకెళ్లేలా ఈ విక్రమ్-1 రాకెట్‌ను డిజైన్ చేశారు. ఈ రాకెట్ ద్వారా ‘మిషన్ ఎంబ్రేస్’ (స్కోప్) అనే ప్రత్యేక పేలోడ్‌తో పాటు మరో మూడు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. కాస్మోస్ స్పేస్ సంస్థ సాంకేతికతతో రూపొందించిన ఈ పేలోడ్, అంతరిక్షంలో ప్రమాదకరంగా మారిన వ్యర్థాలను, పనిచేయని పాత ఉపగ్రహాలను గుర్తించి, సురక్షితంగా కక్ష్య నుంచి తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

ప్రయోగాన్ని వీక్షించనున్న మంత్రి నారా లోకేష్

ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శ్రీహరికోటకు చేరుకున్నారు. ఉదయం 10:20 గంటలకే షార్‌లోని వీవీఐపీ గ్యాలరీకి చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు, ఇస్రో శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు.

2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వడంతో భారతీయ స్టార్టప్‌లు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయి. ఇస్రో సహకారంతో హైదరాబాద్ కి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ సొంతంగా రాకెట్‌ను తయారు చేసి కక్ష్యలోకి పంపుతుండటం నిజంగా భారతీయులందరూ గర్వించదగ్గ విషయం.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×