E-Paper
Advertisement

Anchor Shyamala: వైఎస్ జగన్ కాదట.. అంబటి మాజీ సీఎం అట.. నోరు జారిన శ్యామలక్క!

Anchor Shyamala: వైఎస్ జగన్ కాదట.. అంబటి మాజీ సీఎం అట.. నోరు జారిన శ్యామలక్క!
Advertisement

Anchor Shyamala: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu).. శనివారం (ఏప్రిల్ 18) గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై పలుష పదజాలం అనంతరం తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. తనపై దాడి చేసిన వారితో పాటు కస్టడీలో హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంబటి గర్జించారు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఆ రోజున జరిగిన ఆ ఆసక్తిర ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంబటిని ఏకంగా మాజీ ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ మహిళా నేత, యాంకర్ శ్యామల సంబోధించడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

అసలేం జరిగిందంటే?

గుంటూరులో అంబటి రాంబాబు చేపట్టిన నిరాహర దీక్షకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సైతం అంబటి వద్దకు వెళ్లి ఆయన దీక్షకు మద్దతు ప్రకటించారు. మీరు చేసే పోరాటంలో తామంతా ఉన్నామని భరోసా కల్పించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో శ్యామల నోరుజారినట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అంబటి రాంబాబును మాజీ మంత్రి అనడానికి బదులుగా.. ఆమె మాజీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడం ట్రోల్స్ కు తావిస్తోంది.

Advertisement

నెటిజన్లు సెటైర్లు..!

అంబటిని మాజీ ముఖ్యమంత్రి అంటూ శ్యామల అన్నట్లుగా ఉన్న వీడియోను టీడీపీ శ్రేణులు, నెటిజన్లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె వ్యాఖ్యలను జగన్ కు ముడిపెడుతూ ఆయనపై జాలిగా పోస్టులు పెడుతున్నారు. కొన్ని వైసీపీ పేజీలు సైతం శ్యామల వ్యాఖ్యలను తప్పుబడుతూ నెట్టింట విరుచుకుపడుతున్నాయి. ‘నేను ఎప్పటినుండో చెప్తున్నా. వీళ్లందరూ కలిసి అన్నను ముంచుతారని’ అంటూ జగన్ పేరు, ఫొటోతో ఉన్న సోషల్ మీడియా ఖాతా నుంచి ఓ వ్యక్తి పోస్ట్ పెట్టడం గమనార్హం. అంతేకాకుండా  ‘మాజీ ముఖ్యమంత్రి అంబటి తాత’ అంటూ పలువురు సెటైరికల్ కామెంట్స్ సైతం నెట్టింట చేస్తున్నారు.

Advertisement

Also Read: భారత్‌లో వివో అగ్రస్థానం.. డీలా పడ్డ శాంసంగ్, షావోమి, ఒప్పో.. యాపిల్, గూగుల్ సంగతేంటి?

కేజీఎఫ్ డైలాగ్‌తో రచ్చ రచ్చ!

ఇక అదే ప్రసంగంలో యాంకర్ శ్యామల మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్ చెప్పి.. కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించారు. ‘కూటమి నేతలను ఉద్దేశించి చెబుతున్నా. ‘If you Think Your Bad.. రాంబాబు అన్న Your Dad’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా మరో చర్చకు దారితీశాయి. అయితే శ్యామల చెప్పిన ఈ సినిమా డైలాగ్..  కార్యకర్తల్లో ఫుల్ జోష్ ను నింపాయి. శ్యామల ఈ డైలాగ్ చెప్పిన వెంటనే.. అంబటిని పరామర్శించేందుకు వచ్చిన పార్టీ నేతలు, శ్రేణులు ఒక్కసారిగా ఆనందంతో చప్పట్లు కొట్టారు. మెుత్తం మీద అంబటిని మాజీ సీఎం అంటూ పొరపాటున ఆమె చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా ఆసక్తికర చర్చకు తావిచ్చిందని చెప్పవచ్చు.

Also Read: Wireless vs Wired Charging: మీ మెుబైల్ బ్యాటరీకి ఏది బెస్ట్? ఛార్జింగ్ స్పీడ్, భద్రతకు.. ఏ పద్దతి సురక్షితం!

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×