E-Paper
Advertisement

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు
Advertisement

Amaravati: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూటు మార్చిందా? వైసీపీకి దిమ్మతిరిగేలా కీలక నిర్ణయం తీసుకుందా? ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొత్త పాలసీ తీసుకొచ్చిందా? ఫలితంగా ప్రత్యర్థి శిబిరంలో వణుకు మొదలైందా? చాలామంది మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూటమి గూటికి వచ్చేందుకు రెడీ అయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్

బుధవారం అమరావతిలో చంద్రబాబు కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సోషల్ మీడియాను తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు ఏకంగా పాలసీని తీసుకొచ్చింది. ఈ విషయం తెలిసి మంత్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తరహా పాలసీ ఎక్కడా లేదని, ఇది కరెక్టు కాదేమోనని పలువురు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్‌కు ఇదే కరెక్టని, గతంలో వైసీపీ కూడా ఇదే విధంగా చేసిందని మరికొందరు చెప్పే ప్రయత్నం చేశారట. చివరకు అనేక చర్చల తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పాలసీని తీసుకొచ్చింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Advertisement

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను గుర్తించింది. అయితే ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా కేటగిరీలుగా విభజించి పారితోషికం చెల్లించనుంది ప్రభుత్వం. దీన్ని నాలుగు కేటగిరీలుగా విభజించింది. లక్ష ఫాలోవర్స్ ఉన్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు గరిష్ఠం గా రూ. 15 వేలు ఇవ్వనుంది. 50 వేలు- 99,999 ఫాలోవర్లకు గరిష్ఠంగా రూ. 7,500 ఇవ్వనుంది. ఇక 25000- 49 999 ఫాలోవర్లకు గరిష్ఠంగా రూ. 5000 పారితోషికం ఇవ్వనుంది. ఇక చివరకు 10000-24,999 మధ్య ఫాలోవర్లు ఉన్నవారికి గరిష్ఠంగా రూ. 2500 ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.

నాలుగు కేటగిరీలుగా విభజన, నిధులు ఖాతాల్లో జమ

కొన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇస్తున్నారని, అందుకే ఈ నిబంధన తెచ్చినట్టు వివరించారు. అర్హత పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు వేస్తామని వెల్లడించారు. ఈ కొత్త పాలసీ వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సమాచారం చేరవేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

Advertisement

ALSO READ: ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్ ఉండనుంది. ధృవీకరణ, అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. కేటగిరీ ఆధారిత గుర్తింపు కూడా. అర్హత/ప్రమాణాల ఆధారంగా ఆర్థిక సహాయం ఉంటుంది. క్రియేటర్ కమ్యూనిటీకి మరింత గుర్తింపు ఇవ్వనుంది. ప్రజలను చేరుకోవడానికి డిజిటల్ క్రియేటర్లు రోజురోజుకు మారుతుండడంతో AP క్రియేటర్ ఎకోసిస్టమ్‌కు ఇది ఖచ్చితంగా శుభపరిణామంగా చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీతో వైసీపీ శిబిరంలో వణుకు మొదలైంది. మనవద్దనున్న చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్ వెళ్లిపోతే మన పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Related News

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×