E-Paper
Advertisement

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!
Advertisement

Train Accident: శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నడుమ చేపలు పట్టడానికి వెళ్లిన ఇంటర్మీడియట్ విద్యార్థులపైకి రైలు దూసుకెళ్లిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏం జరిగింది?

Advertisement

టెక్కలి మండలం రావివలస వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో వర్షపు నీరు చేరడంతో, చేపలు పట్టుకునేందుకు ఐదుగురు విద్యార్థులు అక్కడకు వెళ్లారు. చేపల వేట ముగించుకుని తిరుగు ప్రయాణంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా.. భువనేశ్వర్ నుంచి గుణుపూర్ వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో పడుతున్న కుండపోత వర్షం, గాలి హోరు వల్ల వెనుక నుంచి వస్తున్న రైలు శబ్దాన్ని వారు గుర్తించలేకపోయారు.

ఘటనా స్థలంలోనే నలుగురి మృతి

Advertisement

క్షణాల్లో రాజారాణి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బలంగా ఢీకొట్టడంతో విశాఖ రావు, దిలీప్, శరత్, శివ అనే నలుగురు యువకులు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడికక్కడే మరణించారు. సల్మాన్ రాజు అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. గాయపడిన సల్మాన్ రాజును అత్యవసర చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

హాస్టల్ విద్యార్థులుగా గుర్తింపు

ప్రమాదానికి గురైన ఐదుగురు యువకులు టెక్కలిలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. వీరి స్వగ్రామం టెక్కలి మండలంలోని డమరు. చేతికి అందివచ్చిన కుమారులు కళ్ల ముందే విగతజీవులుగా పడి ఉండటంతో డమరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఫలించిన పాలమూరు రైతుల పోరాటం.. జూరాల నుంచి సాగునీరు విడుదల!

Tags

Related News

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

నన్ను మోసం చేశాడు!.. మేనల్లుడిపై బొత్స సెంటిమెంట్ అస్త్రం.. వర్కవుట్ అవుతుందా?

టెక్నికల్ గ్లిచ్ వెనుక ఏం జరిగింది? బెంగళూరు–విజయవాడ విమానం డిలే, అందులో ఏపీ మంత్రి

Big Stories

Advertisement
×