E-Paper
Advertisement

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం మరో రెండు రోజుల పాటు పూర్తి అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లాలో పరిస్థితి తీవ్రతను సమీక్షించేందుకు ఆయన కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

వర్షపాతం.. ప్రాథమిక నష్టం

Advertisement

గడచిన రెండు రోజుల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సగటున 117.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో సుమారు 1,885 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు.

లోతట్టు ప్రాంతాలు, జలాశయాలపై నిఘా

Advertisement

వరద నీరు నిలిచిన చోట తక్షణమే డీ-వాటరింగ్ ప్రక్రియ చేపట్టాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఏలేరు, తాండవ, పంపా, సుబ్బారెడ్డి సాగర్ జలాశయాల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని సుద్దగడ్డ వాగు ఉద్ధృతి, ఉప్పాడ తీరప్రాంత పరిస్థితులపై అధికారులు నిరంతరం సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం

రోడ్లపై విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

మత్స్యకారులకు హెచ్చరికలు

వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆస్తి నష్టం జరిగిన చోట బాధితులకు ప్రభుత్వం నుంచి తక్షణ పరిహారం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read: దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!

Tags

Related News

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

Big Stories

Advertisement
×