E-Paper
Advertisement

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..
Advertisement

Supreme Court: విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. కేసు వివరాలు సీల్డ్‌ కవర్‌లో సెప్టెంబర్‌ 30 నాటికి సమర్పించాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ వచ్చేనెల 12కి వాయిదా వేసింది.

విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు

విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఆ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం.. హైకోర్టులో విచారణపై స్టే విధించింది. సాయికృష్ణకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు కేసు వివరాలను సీల్డ్ కవర్‌‌లో సెప్టెంబర్ 30లోగా సుప్రీంకోర్టుకు అందజేయాలని పేర్కొంది. ఈ క్రమంలో ప్రతివాదులందరకీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే

Advertisement

పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీలు పని చేయకుండా ఎలా ఉంటాయి? ఎందుకు మాయం చేశారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తింది. సాయికృష్ణ తల్లి మే 28న డీజీపీకి ఫిర్యాదు చేశారని, జూన్ 19 వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని గుర్తు చేసింది. సాయికృష్ణ అదృశ్యం గురించి సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేశారని సూటిగా ప్రశ్నించింది. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న విషయం రాష్ట్రం అంగీకరిస్తోందని, మృతదేహం లభించలేదని వ్యాఖ్యానించింది. ఎక్కడికి వెళ్లాడు? మృతదేహం ఏమైంది? అంటూ పలు ప్రశ్నలు సంధించింది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదని పిటిషనర్ తరఫున లాయర్ నిఖిల్ గోయల్ వాదనలు వినిపించారు. హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేశారని కుటుంబ ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. నాన్-బెయిలబుల్ వారెంట్ పేరిట టాస్క్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుందని, ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని వాదనలు వినిపించారు. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీసుస్టేషన్‌లో సీసీటీవీ రికార్డులు తొలగించారని వివరించారు.

ALSO READ: శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Advertisement

ఇటు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని, చార్జ్‌షీట్ దాఖలైందని వివరించారు. కిందిస్థాయి అధికారులపై చర్యలా? ఉన్నతాధికారుల బాధ్యత ఏమైందంటూ ధర్మాసనం ప్రశ్నించింది. సాయికృష్ణ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్‌పై పలుమార్లు వాయిదాలు వేయడం, సీబీఐ దర్యాప్తు కోరినా ఆలస్యం చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐని పక్షంగా చేర్చాలన్న విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోలేదని, తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. కస్టడీలో అదృశ్యం, ఎఫ్‌ఐఆర్ ఆలస్యం, సీసీటీవీ లేకపోవడం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

Related News

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

నన్ను మోసం చేశాడు!.. మేనల్లుడిపై బొత్స సెంటిమెంట్ అస్త్రం.. వర్కవుట్ అవుతుందా?

టెక్నికల్ గ్లిచ్ వెనుక ఏం జరిగింది? బెంగళూరు–విజయవాడ విమానం డిలే, అందులో ఏపీ మంత్రి

Big Stories

Advertisement
×