E-Paper
Advertisement

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?
Advertisement

Degree College: శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 3 దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ సొంత భవనం లేదు. 1984 సంవత్సరంలో డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. తరాలు మారినా ఈ కాలేజీ రూపురేఖలు ఇంచు కూడా మారడం లేదు. పదేళ్ల క్రితం కాలేజీ నూతన భవనానికి ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. కానీ, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులపై పిడుగుపడినట్లయింది. ఆ నిర్మాణం పునాదులకే పరిమితమైంది. అప్పుడు నిర్మించిన అరకొర పిల్లర్లు, గోడలతో ప్రస్తుతం పిచ్చిమొక్కలతో నిండిపోయి భూత్‌బంగ్లాను తలపిస్తుస్తోంది.

పాలకుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం

Advertisement

ఎన్నికల సమయంలో కాలేజీ నిర్మాణంపై అన్ని పార్టీల నేతలు హామీలు ఇచ్చేవారే. తాము అధికారంలోకి రాగానే డిగ్రీ కళాశాల భవనాన్ని పూర్తి చేస్తాం.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తాం అని పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టాక ఆ హామీలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. పాలకుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధ్యాపకుల ఆవేదన

Advertisement

డిగ్రీ కాలేజీలో వసతులపై అధ్యాపకులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా తరగతి గదులు, సరైన మౌలిక వసతులు లేక ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

నూతన భవనం నిర్మించేలా చర్యలు..

మూడు దశాబ్దాలుగా బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవనం లేకపోవడంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాలకు నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని బిగ్‌ టీవీ తరఫున కోరుకుందాం..

Also Read:ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు 

Tags

Related News

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Big Stories

Advertisement
×