Ambati Straight Talk: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైన నుంచి వైసీపీ కీలక నేతలు మీడియాకు ముఖం చాటేశారు. ఆ పార్టీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడేవారు. జరిగిన, జరుగుతున్న పరిణామాలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు నోరు విప్పారు. ‘బిగ్‌టీవీ స్ట్రెయిట్ టాక్’లో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుక్కి భయం పట్టుకుందన్నారు. ఆ భయం ప్రస్తుతం తనను కూడా వెంటాడుతోందన్నారు.