E-Paper
Advertisement

రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!

రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!
Advertisement

Budget EV Scooters: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, మార్కెట్‌కు వెళ్లడం, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం వంటి అవసరాలకు ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. పైగా పెట్రోల్ ఖర్చు ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ వ్యయం కూడా తగ్గుతుంది. అయితే, తక్కువ ధరలో మంచి రేంజ్,  చక్కటి పనితీరు, మెరుగైన ఫీచర్లు ఉన్న 5 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.విడా VX2: రూ.74,499 నుంచి

తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి విడా VX2 బెస్ట్ ఆప్షన్. ఇందులో బ్యాటరీ ప్యాక్‌ను బట్టి సుమారు 93 నుంచి 187 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం ఉండటం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

2.ఓలా S1 X: రూ.84,999 నుంచి

Advertisement

అత్యాధునిక డిజైన్, టెక్నాలజీ ఫీచర్లు కోరుకునేవారు ఓలా S1 Xను సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి సుమారు 108 నుంచి 125 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. కొన్ని వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్ల వరకు ఉంటుంది. యాప్ కనెక్టివిటీ, వేగవంతమైన యాక్సిలరేషన్ దీని ప్రత్యేకతలు.

3.ఆంపియర్ మాగ్నస్ నియో: రూ.71,999 నుంచి

బడ్జెట్ ధరలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే స్కూటర్ కోసం చూస్తున్నవారు ఆంపియర్ మాగ్నస్ నియోను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇందులో LFP బ్యాటరీ అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి సుమారు 80 నుంచి 118 కిలోమీటర్ల IDC రేంజ్ లభిస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో నగర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

4.ఏథర్ కోనార్క్: రూ.1 లక్ష నుంచి

Advertisement

ఏథర్ స్కూటర్లు మంచి బిల్డ్ క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, రైడింగ్ పనితీరుకు గుర్తింపు పొందాయి. ఏథర్ కోనార్క్ కూడా ఈ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఇందులో సుమారు 100 నుంచి 161 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. కుటుంబ అవసరాలకు, నగర ప్రయాణాలకు ఉపయోగపడుతుంది.

5.బజాజ్ చేతక్: రూ.1,04,600 నుంచి

ఎలక్ట్రిక్ స్కూటర్‌ లోనూ బలమైన నిర్మాణం, క్లాసిక్ లుక్ కోరుకునేవారికి బజాజ్ చేతక్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా C2501 ఎంట్రీ వేరియంట్‌ను తీసుకోవచ్చు. ఇందులో సుమారు 113 నుంచి 131 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గరిష్ట వేగం గంటకు 55 నుంచి 73 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మెటల్ బాడీ, బజాజ్ సర్వీస్ నెట్‌వర్క్ దీని కలిసి వచ్చే అంశాలు.

Read Also: రేంజ్ 331 కిలో మీటర్లు.. ధర జస్ట్ 4.69 లక్షలే.. ఈ దీపావళి వేళ 4 చౌకైన ఈవీలు ఇవే!

Tags

Related News

రేంజ్ 331 కిలో మీటర్లు.. ధర జస్ట్ 4.69 లక్షలే.. ఈ దీపావళి వేళ 4 చౌకైన ఈవీలు ఇవే!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 3XO CNG.. ఎంత స్కోర్ సాధించిందంటే?

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

Big Stories

Advertisement
×