BigTV English

Palamuru Tenders cancel : పాలమూరు టెండర్లు రద్దు.. కొత్త టెండర్లు ఎప్పుడంటే..

Palamuru Tenders cancel : పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలోని రిజర్వాయర్ల కింద కాల్వలతో పాటు.. వికారాబాద్​ జిల్లాలో ప్రాజెక్టు విస్తరణ పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోపే 7 వేల కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించనున్నట్టు సమాచారం.

Palamuru Tenders cancel : పాలమూరు టెండర్లు రద్దు.. కొత్త టెండర్లు ఎప్పుడంటే..

Palamuru Tenders cancel : పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలోని రిజర్వాయర్ల కింద కాల్వలతో పాటు.. వికారాబాద్​ జిల్లాలో ప్రాజెక్టు విస్తరణ పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోపే 7 వేల కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించనున్నట్టు సమాచారం. దీనిపై నేడు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత కేసీఆర్​ప్రభుత్వం హడావుడిగా ఈ టెండర్లు పిలవడం.. అన్ని పనులను నిర్దేశిత మొత్తాని కన్నా ఎక్కువకే కాంట్రాక్టర్లు దక్కించుకోవడంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు.


పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​ స్కీంలో ఉద్దండాపూర్, కర్వెన రిజర్వాయర్ల కింద ప్రధాన కాల్వలతో పాటు ఏడు పనులు చేపట్టేందుకు 3747.49 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. ఈ పనుల టెండర్లను వర్క్ ఏజెన్సీలు నాలుగు శాతానికి పైగా ఎక్సెస్​కు దక్కించుకున్నాయి. దాంతో ఇప్పుడు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం వీటిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

ఈ మేరకు ఈరోజు సెక్రటేరియెట్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. ఈ సమీక్ష తర్వాత టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అలాగే అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్లు అందించే.. ఉమా మహేశ్వర ఎత్తిపోతల స్కీం టెండర్‌‌‌‌ను కూడా రద్దు చేయనున్నట్టు భావిస్తున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×