E-Paper
Advertisement

CM Chandrababu: బిగ్ టీవి ఎఫెక్ట్.. అరటి రైతులకు బిగ్ రిలీఫ్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: బిగ్ టీవి ఎఫెక్ట్.. అరటి రైతులకు బిగ్ రిలీఫ్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Advertisement

CM Chandrababu: అనంతపురం జిల్లాలో అరటి రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. మార్కెట్లో అరటి ధరలు రూపాయికి దిగువకు పడిపోవడంతో, పండించిన పంట అంతా ఖర్చు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.

సంవత్సరం పొడవునా శ్రమించి పండించిన అరటిని అమ్మలేక, కొందరు రైతులు ట్రాక్టర్లతో మొక్కలను దున్నేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరటి రైతుల కష్టాలపై BIG TV వరుస కథనాలు ప్రసారం చేయడంతో, ఈ క్రమంలో స్పందించిన అనంత జిల్లా జాయింట్ కలెక్టర్, హార్టికల్చర్ DD, ఇతర కీలక అధికారులు స్వయంగా రైతుల పొలాలకు సందర్శించారు.

Advertisement

రైతులు పడుతున్న ఇబ్బందులను విన్న అధికారులు, మార్కెట్ వ్యవస్థలో ఉన్న సమస్యలు, రవాణా ఇబ్బందులు, ధరలు తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు ప్రారంభించాం. రైతుల సమస్యలు పరిష్కరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం అని అధికారులు స్పష్టం చేశారు.

అరటి రైతుల ఆక్రందనలపై వచ్చిన రిపోర్ట్స్‌ను గమనించిన సీఎం చంద్రబాబు, CMO అధికారులతో అత్యవసరంగా అరటి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ధరలు పడిపోవడానికి కారణాలను, మార్కెట్‌లోని డిమాండ్ పరిస్థితిని ముఖ్యమంత్రి వివరంగా తెలుసుకున్నారు.

Advertisement

మార్కెట్లలో డిమాండ్ పెరగబోతున్న నేపథ్యంలో, అధికారుల అంచనా ప్రకారం డిసెంబర్ 15 తర్వాత అరటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక వ్యాగన్లు పెట్టి కోల్కత్తా , ముంబై కు అరటి ఎగుమతులు చేయాలని సీఎం సూచించారు. రవాణాలో లాజిస్టిక్ సమస్య లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అరటి ఎగుమతులను వేగవంతం చేయాలి.  రేట్లు స్థిరపడేందుకు పెద్ద బయ్యర్స్–సెల్లర్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలి సీఎం చెప్పారు.

ఈ చర్యలన్నీ అమల్లోకి వస్తే, అనంత జిల్లాలో పండిన అరటి దేశంలోని పెద్ద మార్కెట్లకు సమయానికి చేరి, మంచి ధరలు పొందే అవకాశం ఉంటుంది.

Also Read: జగన్ తో కేటీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మీటింగ్

అనంత జిల్లాలో భారీ నష్టాలు చవిచూస్తున్న అరటి రైతులకు.. త్వరలోనే శుభవార్త వింటారని అధికారులు భావిస్తున్నారు. ధరలు మెరుగుపడే దిశలో సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×