Anantapur Central University: అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థినులు రాత్రి ధర్నా నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినుల బాత్ రూం లోకి తొంగి చూశారంటూ ఆరోపించారు. బాత్ రూంల దగ్గర నిచ్చెనలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై వీసీ సమాధానం చెప్పాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఆదివారం రాత్రి వర్సిటీ విద్యార్థిణులు ఆందోళనకు దిగారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళా హాస్టల్స్ వద్దకు వస్తున్నారని, బాత్రూమ్‌ల్లోకి తొంగి చూశారని ఆరోపించారు. ఈ క్రమంతో స్టూడెంట్స్ అంతా ఆందోళనకు దిగారు. తొలుత ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు. ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో నిరసనలు, ధర్నాలకు దిగాల్సి వచ్చిందన్నది మహిళా విద్యార్థుల మాట.
ఆదివారం రాత్రి కూడా కొందరు గుర్తు తెలియని అగంతకులు విద్యార్థినుల హాస్టల్ వైపు వచ్చారు. తమ వాష్ రూములోకి తొంగి చూడటాన్ని గమనించారు. వెంటనే కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే విద్యార్థినులు ఈ విషయాన్ని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అర్ధరాత్రి వేళ క్యాంపస్ రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.
సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడంపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి విషయాన్ని విద్యార్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని విమర్శలున్నాయి. ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
ALSO READ: తిరుమల లడ్డూ కేసు.. తీగ లాగుతున్న సిట్, ఆ ఇద్దరికీ నోటీసులు?
వచ్చినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఆ మహిళా ఎమ్మెల్యే ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదు. అక్కడ విద్యార్థులకు రక్షణ లేదని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.