BigTV English
Advertisement

SIT On Laddu Adulteration: తిరుమల లడ్డూ కేసు.. తీగ లాగుతున్న సిట్, ఆ ఇద్దరికీ నోటీసులు?

SIT On Laddu Adulteration: తిరుమల లడ్డూ కేసు.. తీగ లాగుతున్న సిట్, ఆ ఇద్దరికీ నోటీసులు?

SIT On Laddu Adulteration: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులకు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నెయ్యి టెండర్ ఖరారు బోలే బాబా డైరీకి సహకరించిన పాలక మండలి సభ్యులెవరు? అప్పటి ఈవో ఎవరు అనేదానిపై డీటేల్స్ సేకరించిందట. కొంతమంది కోసం ఉత్తరాఖండ్‌కు సిట్ సభ్యులు వెళ్లినట్టు సమాచారం.


తీగలాగిన సిట్?

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు వేగం పెంచింది సీబీఐ ఆధ్వర్యంలోని సిట్. గతంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో టీటీడీలో పని చేసిన మాజీ ఈవో, గత పాలకమండలికి చెందిన ఓ వ్యక్తికి నోటీసులు జారీ కాబోతున్నాయట. కల్తీ నెయ్యి ఒప్పందాల్లో వీరిద్దరి పాత్రను సిట్ ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.


ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే వీలు లేకుండా ముందు జాగ్రత్తగా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. టీటీడీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పాలకమండలి సభ్యుడు, అప్పటి టీటీడీ ముఖ్య అధికారితో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించింది. ఆ వ్యక్తి నెయ్యి సరఫరాకు సంబంధించిన డెయిరీల తరఫున టీటీడీతో ఒప్పందాలు కుదర్చడంలో కీలక పాత్ర పోషించినట్టు సిట్ భావిస్తోంది. ఆ దిశగా వారి ఖాతాలను, జరిగిన లావాదేవీలను పరిశీలన చేస్తోంది.

డెయిరీల నిర్వాహకులు-మధ్యవర్తులు-టీటీడీకి చెందిన అధికారుల మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించి విశ్లేషించే పనిలో పడింది సిట్. ఇదిలాఉండగా కేసు దర్యాప్తులో సిట్‌ అధికారులు ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారట. నెయ్యి నాణ్యం లేదని టీటీడీ ల్యాబ్‌ రిపోర్టు ఇచ్చినప్పటికీ, పాలకమండలికి చెందిన ఓ కీలక వ్యక్తి జోక్యం చేసుకున్నాడట.

ALSO READ: వంశీ కేసులో కీలక పరిణామం, కుదిరితే కస్టడీ, లేదంటే ములాఖత్

ఉచ్చులో వారిద్దరి, ఆ తర్వాత

ఆ విభాగం నిపుణులతో నెయ్యి నాణ్యత బాగుందంటూ లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించాడని తెలుస్తోంది. దాని ఆధారంగా వెనక్కి పంపిన ట్యాంకర్లను తిరిగి రప్పించి నెయ్యి తీసుకున్నట్టు నిర్ధారించారట. అయితే ఆ నెయ్యికి టీటీడీ నుంచీ బిల్లులు బ్యాంకు ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లింపులు చేసినట్టు తెలిసింది.

సిట్‌లో ఓ టీమ్ ఉత్తరాఖండ్ వెళ్లింది. భోలేబాబా డెయిరీలో దర్యాప్తు చేస్తోంది. కల్తీ నెయ్యికి సంబంధించి డెయిరీ, కొందరు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేసింది. వీటి ద్వారా కీలక సమాచారం గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఈ డెయిరీలో పని చేస్తున్న 9 మందిని నిందితులుగా గుర్తించారు. సిట్ విషయం తెలియగానే వారంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు పట్టుబడితే కేసు క్లయిమాక్స్ కు రావడం ఖాయమని అంటున్నారు.

ఫిబ్రవరి 9న కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులు రాజశేఖరన్‌, పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, వినయ్‌కాంత్‌ చావడాను సిట్ అరెస్ట్ చేసింది. ఈనెల 14న శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిందితులను విచారించేందుకు సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

Related News

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Jagan Tweet: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు

TDP Politics: కొందరు నేతలపై మంత్రి లోకేష్ సీరియస్.. ఏం జరిగింది? మళ్లీ వచ్చేసరికి

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Big Stories

×