BigTV English

Turmeric: పసుపుతో బోలెడు ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ !

Turmeric: పసుపుతో బోలెడు ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ !

Turmeric: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. గాయాలు, నొప్పి, వాపులను తగ్గించడానికి పసుపు చాలా కాలంగా ఉపయోగించబడుతోంది. అంతే కాకుండా ఆహార పదార్థాల్లో మనం వాడే చిటికెడు పసుపు, వ్యాధులు. మనపై దాడి చేసినప్పుడు బలమైన కవచంగా పనిచేస్తుంది.


పసుపు ఆహారం యొక్క రంగు, రుచిని పెంచడమే కాకుండా పోషక విలువను కూడా పెంచుతుంది. ఇదిలా ఉంటే పసుపు జలుబు, గుండె జబ్బులు , క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.

పసుపులోని  పోషక విలువలు:
ఒక టీస్పూన్ పసుపులో దాదాపు 29 కేలరీలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు, పసుపులో మాంగనీస్, ఇనుము , పొటాషియం వంటి శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.


పసుపులోని  ఔషధ గుణాలు: 

పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన కర్కుమిన్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అంతే కాకుండా పసుపులో యాంటీ మైక్రోబియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని జలుబు నుండి కాపాడుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.

పసుపు ఏ వ్యాధుల నుండి రక్షిస్తుంది ?
పసుపును క్రమం తప్పకుండా తీసుకుంటే మన జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం నొప్పిని నివారిస్తుంది . చిన్న గాయాలైన సమయంలో పసుపును గాయం తగిలిన చోట వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది:

ప్రపంచంలో అత్యధిక మరణాలకు గుండె జబ్బులు కూడా ఒక కారణం. మన గుండెలో ఎండో థెలియం ఒక ప్రత్యేక పనితీరును నిర్వహిస్తుంది. దాని పనితీరు క్షీణించినప్పుడు, రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది. రక్తం గడ్డ కట్టే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు కూడా ప్రధాన కారణం.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పసుపు ఎండోథెలియం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

క్యాన్సర్ :
కర్కుమిన్ ప్రారంభ దశలోనే అనేక రకాల క్యాన్సర్‌లను నయం చేయగలదు. కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదల , అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంలో మూడు ప్రధాన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

1.కర్కుమిన్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.2. కణితిలో కొత్త రక్త నాళాలు (యాంజియోజెనిసిస్) ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. 3.  క్యాన్సర్ వ్యాప్తి (మెటాస్టాసిస్) తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్ :
ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సలో ప్లేసిబో (ఆర్థరైటిస్‌కు ఇచ్చే చికిత్స) కంటే పసుపు మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఇది వాపు , నొప్పి రెండింటినీ తగ్గిస్తుంది. ఇది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాగా పనిచేస్తుంది.

అల్జీమర్స్ :
అల్జీమర్స్ అనేది మతిమరుపు యొక్క అత్యంత సాధారణ రూపం. 70% మతిమరుపు కేసులకు అల్జీమర్స్ కారణం. అల్జీమర్స్ మెదడులో వాపు, ఆక్సీకరణ నష్టాన్ని పెంచుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్ కర్కుమిన్ అల్జీమర్స్ యొక్క ఈ రెండు లక్షణాలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అల్జీమర్స్ మెదడులో రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతుంది. కర్కుమిన్ వాటిని సరిచేయడానికి సహాయపడుతుంది. చికిత్సతో పాటు పసుపును క్రమం తప్పకుండా తీసుకుంటే, ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.

Also Read: నెల రోజులు చక్కెర తినకపోతే.. ఇన్ని లాభాలా !

ప్రతి రోజు పసుపు తినడం మంచిదేనా ?
పసుపు ఆరోగ్యానికి అందించే వివిధ ప్రయోజనకరమైన లక్షణాలను పరిశీలిస్తే, దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి 12 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ పసుపు తీసుకుంటే వారు విరేచనాలు, మలబద్ధకం లేదా వాంతులు వంటి దుష్ప్రభావాలను ఎదుర్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×