E-Paper
Advertisement

Somireddy on Jagan: జగన్‌కు శవాలంటే ఇష్టం.. చంపి డిక్కీలో పడేస్తే భుజం తట్టాడు.. టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు

Somireddy on Jagan: జగన్‌కు శవాలంటే ఇష్టం.. చంపి డిక్కీలో పడేస్తే భుజం తట్టాడు.. టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు
Advertisement

Somireddy on Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సోమిరెడ్డి.. ప్రతిపక్ష నేతకు శవరాజకీయాలు అంటే చాలా ఇష్టమని ఆరోపించారు. అందుకే వైసీపీ ఎమ్మెల్సీ కారు డిక్కీలో శవం వేసుకుంటే భుజం తట్టి ప్రోత్సహించారని సెటైర్లు వేశారు.

వైసీపీ అధినేతకు శవాలతో పాటు విధ్వంసమన్నా ఇష్టమేనని సోమిరెడ్డి సెటైర్లు వేశారు. ఆయన ర్యాలీలో ఒకరిద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోతే.. కనీసం పరామర్శకు సైతం వెళ్లలేదని విమర్శించారు. పక్క పార్టీ నేతలను బూతులు తిట్టిన వారి ఇంటికి జగన్ పరామర్శకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఈ వైఖరిని ‘మర్చంట్ ఆఫ్ డెత్’ గా సోమిరెడ్డి అభివర్ణించారు. శవ రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది వైసీపీనే అని ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

అంతకుముందు తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడిన శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. నేటి తరం విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ 700 మందికి పైగా విద్యార్థులు అసెంబ్లీని వీక్షించారన్న స్పీకర్.. 2 రోజుల వ్యవధిలో 200కు పైగా స్కూళ్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అవుతామని కొందరు విద్యార్థులు చెబుతుండటం సంతోషకరమని.. పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహణలు పెరగడం శుభపరిణామని చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: Bangladesh – BJP: బంగ్లాదేశ్‌లో సంచలనం.. బోణి కొట్టిన బీజేపీ.. భారీ మెజారిటీతో ప్రభంజనం

శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేశ్ తో సమావేశం ఎంతో ఆత్మీయంగా అనిపించిందని స్పీకర్ అయన్న పాత్రులు అన్నారు. టీడీపీ నేతలంతా ఒకే కుటుంబ సభ్యుల్లా గడిపామన్నారు. మంత్రి లోకేశ్ సన్నబడిన అంశంపై కూడా మాట్లాడుతూ ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాటించే డైట్ ఫాలో అయితే ఎవరైన తగ్గుతారని.. లోకేశ్ ఇప్పటికే బాగా తగ్గారని.. మరీ ఎక్కువ బరువు తగ్గొద్దని ఆయనకు సూచించాచని స్పీకర్ అయ్యన్న చెప్పుకొచ్చారు.

Also Read: AP Budget 2026: కాసేపట్లో ఏపీ వార్షిక బడ్జెట్.. కనకదుర్గమ్మ చెంతకు ప్రతులు.. రాష్ట్ర కేబినేట్ కీలక భేటి

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×