E-Paper
Advertisement

ఏపీలో కొత్త భవనాలకు న్యూ రూల్స్.. వాటికి సడలింపు, ఆ ఫీజులు విడతలవారీగా

ఏపీలో కొత్త భవనాలకు న్యూ రూల్స్.. వాటికి సడలింపు, ఆ ఫీజులు విడతలవారీగా
Advertisement

AP Building Rules: భవన నిర్మాణాలకు సంబంధించి కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌లో సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు భిన్నంగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. భవనాలకు కొత్త నిబంధనలు తీసుకురావడమే కాదు పర్యావరణం, ఫైర్‌ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త రూల్స్‌ను ఒక్కసారి చూద్దాం.

ఏపీలో కొత్త భవనాలకు న్యూ రూల్స్-భవన నిర్మాణాలకు సంబంధించి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌-2017 కు కొన్ని సవరణలు చేసింది. దీనిపై మున్సిపల్‌-పట్టణాభివృద్ధి శాఖ విభాగం కొత్త జీవో జారీ చేసింది. దాని ప్రకారం.. కేంద్రం సూచించిన డీ-రెగ్యులేషన్‌ మార్గదర్శకాలు, ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండేలా మార్పులు చేసింది. అంతేకాదు భవనాల భద్రత, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్‌ అనుమతుల వ్యవస్థ ఈసారి పొందుపరిచింది. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి.  భవనాలు 24 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రతీ భవనాలను హైరైజ్‌ భవనంగా లెక్కలోకి తీసుకుంటారు.

Advertisement

ఈసారి 24 డాక్యుమెంట్లు సమర్పణ-నిర్మాణానికి అనుమతులు తీసుకునే సమయంలో ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబందించి ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. గతంలో 12 రకాల డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసేవారు. ఇప్పుడు 24 రకాల డాక్యుమెంట్లను దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాల్సివుంది. ఇక స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలకు రిలీఫ్. కనీస విస్తీర్ణం ఉండాలనే నిబంధనను అందులో నుంచి తొలగించారు. ఆసుపత్రులకు సంబంధించి ఉన్న నిబంధనలను సవరించింది. హైరైజ్‌ భవనాలున్న ఆసుపత్రులకు సెట్‌ బ్యాక్‌ కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా హైరైజ్ భవనాలు, ఇండస్ట్రియల్, కమర్షియల్ భవనాలకు ఫైర్ ఎన్వోసీ కచ్చితంగా ఉండాల్సిందే. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం ఫైర్ సేఫ్టీ డాక్యుమెంట్ ఉండాలి.

ఈ కిందివాటికి మినహాయింపు-ఆలయాలు, చర్చిలు, మసీదుల భవన నిర్మాణాలకు అనుమతుల రుసుములు, ఇతర చార్జీలను మినహాయించింది ప్రభుత్వం. అయితే ఆ భూమి లేకుంటే భవనాన్ని పూర్తిగా ప్రార్థనా కార్యక్రమాలకు వినియోగించాలనే షరతు విధించింది. 5 వేల చదరపు మీటర్లపైగా నిర్మాణాలున్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, టౌన్ షిప్‌లు, హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు తప్పనిసరి చేసింది. అందులో ఉద్యోగులు 50 మందికి పైగా పనిచేసే అపార్ట్‌మెంట్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, షాపింగ్ ‌మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థల్లో క్రెచ్‌ అంటే పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు తప్పనిసరి చేసింది.

Advertisement

ALSO READ: జనసేన నుండి 26 మంది ఔట్! అధినేత పవన్ నిర్ణయం వెనుక ఏం జరిగింది?

ఫీజులు చెల్లింపు విషయంలో..సిటీ స్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంపాక్ట్‌ ఫీజుకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజును మూడేళ్లలో ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. నాన్‌-హైరైజ్‌ భవనాల నిర్మాణానికి సంబంధించి కనీసం 3 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. బాల్కనీకి అనుమతి ఉంటుంది. హైరైజ్ భవనాల్లో 10 అంతస్తులకు పైబడి ఉంటే ఎన్విరాన్‌మెంట్‌ డెక్‌ ఫ్లోర్‌ 4.50 మీటర్లతో ఏర్పాటు చేయాలి. మొక్కలు, తోటలు, వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ వంటివి ఉండొచ్చు. కమర్షియల్ కాంప్లెక్స్‌, హౌసింగ్ సొసైటీ, టౌన్‌షిప్‌లలో ఈవీ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఉండాలి. ఆస్పత్రులు, స్కూళ్లు షాపింగ్స్ మాల్స్, పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఆఫీసులు ఉంటే అక్కడ క్రెచ్ తప్పనిసరిగా ఉండాలి.

Related News

జనసేన నుండి 26 మంది ఔట్! అధినేత పవన్ నిర్ణయం వెనుక ఏం జరిగింది? టార్గెట్ అదేనా?

కష్టాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, కిడ్నాప్ కేసు కష్టాలు, సెల్ఫీ వీడియో విడుదల, ఏం జరిగింది?

నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్-ఎల్లో అలర్ట్, హైదరాబాద్‌లో కూడా

ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10 వేల ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఏయే విభాగాలంటే

భోగాపురం ఎయిర్‌పోర్టు.. యూజర్ ఛార్జీలు ఎంతంటే, ట్రావెల్ కోడ్ బదిలీ

ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!

శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!

Big Stories

Advertisement
×