E-Paper
Advertisement

జనసేన నుండి 26 మంది ఔట్! అధినేత పవన్ నిర్ణయం వెనుక ఏం జరిగింది? టార్గెట్ అదేనా?

జనసేన నుండి 26 మంది ఔట్! అధినేత పవన్ నిర్ణయం వెనుక ఏం జరిగింది? టార్గెట్ అదేనా?
Advertisement

Janasena: పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పార్టీలో మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో  రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 26 మంది అధికార ప్రతినిధులను బాధ్యతల నుంచి తప్పించారు. వచ్చేనెలలో కొత్త కమిటీ ప్రకటన రానుంది. అప్పటివరకు మీడియా సమావేశాల్లో పార్టీ పేరు వాడకంపై ఆంక్షలు విధించారు.

జనసేన పార్టీలో మార్పులు-చేర్పులు-ఏపీ రాజకీయాల్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు మార్పులు-చేర్పులు చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇదే బాటలో జనసేన కూడా వెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Advertisement

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు-పార్టీ బలోపేతం దిశగా వేసే ప్రతి అడుగు వేస్తున్నారు. కమిటీల నియామకం పై ఆయన స్వయంగా కసరత్తు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే  ప్రకాశం, నెల్లూరు జిల్లా కమిటీలను రద్దు చేశారు ఆయన. కొత్త కమిటీల ఏర్పాటు కోసం బాధ్యతలు కేడర్‌కే అప్పగించారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలను ప్రకటించారు. ఈ కసరత్తు  స్వయంగా పర్యవేక్షిస్తున్న పవన్, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అధికార ప్రతినిధుల కమిటీ రద్దు –పార్టీలో అధికార ప్రతినిధుల కమిటీ రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో జనసేన తరపున పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు 26 మంది అధికార ప్రతినిధులు. వారిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. కొత్త కమిటీని ప్రకటించే వరకు ఎవరూ టీవీ డిబేట్లో పాల్గొనకూడదని ఆదేశించింది ఆ పార్టీ.

Advertisement

కొత్తవారితో వేగంగా అడుగులు-పార్టీ తరఫున మీడియాకు ప్రకటనలు చేయడం, రాజకీయ అంశాలపై చర్చల్లో పాల్గొనడం నిలిపి వేసింది. కొత్త కమిటీలు ఏర్పడే వరకు తాజా ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయాలు అధినేత తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయడం, కొత్త వారితో బరిలోకి దిగాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.

ALSO READ: కష్టాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కిడ్నాప్ కేసు నమోదు, సెల్ఫీ వీడియోలో నిజాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి కూర్పు మొదలు పెట్టినట్టు ఆ పార్టీ వర్గాల మాట. ఈసారి యువతరానికి పెద్ద పీఠ వేయాలని ఆలోచన చేస్తున్నారు.  ఐటీ ఉద్యోగులు, చదువుకున్నవారు, వివిధ రంగాలకు చెందినవారికి స్థానం కల్పించాలని  డిసైడ్ అయనట్టు ఆ పార్టీ వర్గాల మాట.

 

 

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×