AP Rain: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు అలర్ట్ జారీ చేసారు. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతుందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం మీదుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అంకాశం ఉందని అన్నారు. దీంతో 13 జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్ష సూచనలు అధిక వర్షాలున్నాయని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also read: మెగా డీఎస్సీ కాదు.. అది దగా డీఎస్సీ.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలకు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో ఆకస్మిక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదవగా.. ఏలూరు పెరికగూడెంలో 31.3 మి.మీ, పెంటపాడులో 27.6 మి.మీ. వర్షపాతం చందర్లపాడు, పండ్రపాడులో 24 మి.మీ. చొప్పున వర్షపాతం ఇప్పటికే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also read: ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!