Chinna Srinu Joins TDP:విజయనగరం జిల్లాలో వైసీపి కి పెద్ద షాక్ తగిలింది.బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. తనతో పాటు అనుచరులు కూడా టీడీపీలో చేరడం విశేషం.
చంద్రబాబు స్వయంగా చిన్న శ్రీనుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాకు చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బొత్స సత్యనారాయణకు మేనల్లుడు కావడంతో
చిన్న శ్రీను టీడీపీలో చేరడం ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు వైసీపీకి దగ్గరగా ఉన్న ఆయన.. ఇప్పుడు సైకిల్ పార్టీలో చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణకు మేనల్లుడు కావడంతో చిన్న శ్రీను చేరికకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందనే చెప్పాలి.
చిన్న శ్రీను ఒక్కడే కాకుండా తన వెంట ఉన్న అనుచరులు కూడా tdp పార్టీ కండువా కప్పుకోవడంతో కార్యక్రమం సందడిగా సాగింది. పెద్ద సంఖ్యలో అనుచరులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఇది ఒకరంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కూడా జోష్ పెంచిందనే చెప్పాలి.
ఇక చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. తండ్రి, కుమార్తె ఇద్దరూ ఒకేసారి టీడీపీలో చేరడంతో విజయనగరం జిల్లలో వైసీపికి ,అలాగే బొత్స సత్యనారాయణకి పెద్ద షాక్ అనే చెప్పాలి.
విజయనగరం జిల్లాలో ఇప్పటికే రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో చిన్న శ్రీను చేరిక కూడా టీడీపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.చిన్న శ్రీను టీడీపీలోకి రావడంతో వైసీపీకి కూడా ఇది ఒక ఎదురుదెబ్బగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే ఆయన చేరిక వల్ల స్థానికంగా వైసీపీపై ఎంత ప్రభావం పడుతుంది? టీడీపీకి ఎంత బలం పెరుగుతుంది? అనేది రాబోయే రోజుల్లోనే తేలాలి.
చంద్రబాబు సమక్షంలో జరిగిన చేరిన చిన్న శ్రీను పార్టీలో లాంటి బాధ్యతలు పోషిస్తారో విజయనగరం రాజకీయాల్లో ఆయనకు ఎలాంటి పాత్ర అప్పగిస్తారు? అన్నదానిపై కూడా అక్కడి ప్రజలు చాలా ఆసక్తి గా చూస్తున్నారు.
మొత్తానికి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసిందనే చెప్పాలి. అనుచరులతో కలిసి ఆయన సైకిల్ పార్టీలో చేరడం, కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీ కండువా కప్పుకోవడంతో ఈ చేరికకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.మరి రాబోయే రోజుల్లో చిన్న శ్రీను టీడీపీలో ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాలి.
ALSO READ:ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?
ఏది ఏమైనా అధికారాన్ని కోల్పోయిన వైసీపిని ఇలాంటి పట్టున్న నాయకులు దూరమవడం రాజకీయంగా మరింత లోటని చెప్పకతప్పదు.