Cheque Power: తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్–ఉప సర్పంచ్‌ల మధ్య చెక్ పవర్ వివాదానికి ప్రభుత్వం చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం పంచాయతీ నిధుల చెక్కులకు ఇద్దరి సంతకాలు తప్పనిసరి. ఈ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే.. నిధులు ఉన్నా పనులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. ఉప సర్పంచ్ వారం రోజుల్లో సంతకం చేయకపోతే కలెక్టర్‌కు నిధుల మంజూరు అధికారం ఇచ్చేలా కొత్త బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ నిధులు నేరుగా సర్పంచ్‌లకు అందేలా మార్పులు ఉంటాయని మంత్రి సీతక్క ప్రకటించారు. అధికారాన్ని ఒకరి చేతికి మరింత కేంద్రీకరిస్తే సమస్య తీరుతుందా? లేక పారదర్శకతపై కొత్త అనుమానాలు మొదలవుతాయా? గ్రామానికి అవసరమైన పనులు రాజకీయ విభేదాలతో ఆగకూడదు. అదే సమయంలో చెక్ పవర్ మార్పు దుర్వినియోగానికి ఛాన్స్ లేకుండా ఉండాలి. మరి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధిస్తుందా?