E-Paper
Advertisement

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్
Advertisement

KTR Fires on Revanth Reddy:తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇష్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల సభ్యత్వం రద్దు చేస్తారన్న వార్తలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికే గజ్వేల్‌లో హడావుడి చేశారని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ ముందు మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.అధికారం చేతిలో అహంకారంతో కాంగ్రెస్ నేతలను రెచ్చగొడుతున్నారని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో పంపించారని అన్నారు. పోలీసుల ఎస్కార్ట్ పెట్టి మరీ అక్కడికి జనాలను తీసుకెళ్లారని ఆరోపించారు.

Advertisement

ఇక ఎమ్మెల్సీ తాతా మధు ఏమన్నారని,అతను చేసిన కామెంట్స్ విషయంలో కాంగ్రెస్ ఎందుకింత నానా యాగీ చేస్తుందని, తమ ఎమ్మెల్సీ స్పీకర్‌ను ఉద్దేశించి ఆ మాట అనలేదని ఇప్పటికే చెప్పారని తెలిపారు. అయినా స్పీకర్ బాధపడి ఉంటే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమాపణ చెబుతున్నానని కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన తర్వాతే ఎమ్మెల్సీ ఈ వివరణ ఇచ్చారని కేటీఆర్ మీడియాకి తెలిపారు.అయినా మా MLCలను సస్పెండ్ చేయడానికి తెలంగాణా ఏమైనా మీ అయ్యా జాగీరా అంటూ మండిపడ్డారు.

ఇక ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని, చిన్న విషయాన్ని పట్టుకుని పెద్దది చేస్తున్నారని ఫైర్ అయ్యారు..నిన్న అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు దాడి చేశారని, మహిళా ఎమ్మెల్యేలతో ఇలా వ్యవహరించడం ఏంటని కోపాన్ని వెళ్లగక్కారు. వారిని జుట్టు పట్టుకుని లాగారని, గొంతు పట్టుకున్నారని, చీర లాగారని మహిళా mla లకే రక్షణ కరువైతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Advertisement

స్పీకర్‌ను మధ్యలోకి తీసురావడం బట్టి చూస్తే ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అని అర్థం అవుతున్నదని,స్పీకర్‌ను, ఆయన కులాన్ని కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదని తెలిపారు. సభలో ఏదైనా సమస్య వస్తే దాన్ని చర్చించి పరిష్కరించుకోవాలి కానీ.. ఒకరిని ఒకరు తిట్టుకుని గొడవలు పెట్టుకునే దాకా వెళ్ళడం మంచిది కాదని అన్నారు.

ఇక కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ చనిపోవాలంటూ మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని అలా అంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై ఇలాంటి మాటలు మాట్లాడటం బాధాకరమన్నారు.

కేసీఆర్‌ను కలవడానికి తాము వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్ చెప్పారు. తమను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. తాము చట్టాన్ని గౌరవించి పోలీస్ స్టేషన్‌లో కూర్చుంటే.. బయట కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

ALSO READ:ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?

అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా 823 రోజుల సమయం మాత్రమే ఉందని ,ఈరోజు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే.. రేపు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.మొత్తానికి రెండు పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలతో తెలంగాణా రాజకీయం రసకందాయంలో పడిందనే చెప్పాలి.

Tags

Related News

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

కోర్టు ఉత్తర్వులంటే అలుసా? ఐఏఎస్‌ల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

తెలంగాణ శాసన మండలిలో షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు!

ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?

బూతులు, బట్టలు విప్పడాలు.. ఇదేం దారుణం..కూనంనేని ఫైర్

“చిల్లర నా కొ..” అంటూ రెచ్చిపోయిన KTR.. పోలీసులతో రచ్చ!

అదో దెబ్బ, దానికో పరామర్శ.. టీవీలు చూస్తూ నవ్వుకుంటున్నారు.. బండి సెటైర్లు!

Big Stories

Advertisement
×