Nora Fatehi: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ అలాగే పలు స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మనోరా ఫతేహి(Nora Fatehi)కి ప్రత్యేకమైన పాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మకు ఏవియేషన్ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సంస్థ నోరా ఫతేహికి వ్యతిరేకంగా మూడు కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేయడంతో గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. అసలు ఈమెపై ఏవియేషన్ సంస్థ కోట్లాది రూపాయలు పరువు నష్టం దావా వేయడానికి గల కారణాలు ఏంటి అనేది విషయానికి వస్తే..
గత డిసెంబరులో ముంబై నుంచి జైపూర్ ప్రయాణిస్తున్న సమయంలో డ్యూన్స్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా సైటేషన్ CJ2 చార్టర్డ్ విమానంలో ప్రయాణం చేశారు. ఈమె ప్రయాణం చేస్తున్న సమయంలో విమానం లోపల ఒక వీడియోని తీసి ఆ వీడియోని కాస్త తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసారు.ఆ వీడియోల్లో విమానాన్ని చిన్న బొమ్మ, లెగో ఏరోప్లేన్, టాయ్ ప్లేన్ అంటూ సంబోధించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమెకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇలా మిలియన్ ఫాలోవర్లు ఉన్న నోరా డ్యూన్స్ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన విమానాన్ని బొమ్మ విమానంగా పోల్చి వీడియో షేర్ చేయడంతో సదరు విమాన సంస్థ ఈమెపై వ్యతిరేకంగా చర్యలకు సిద్ధమైంది. ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా తమ ఏవియే షన్ సంస్థ గురించి ఈ వీడియో షేర్ చేయడంతో అది పూర్తిగా తమ సంస్థ పట్ల తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తమ మార్కెట్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందని డ్యూన్స్ ఏవియేషన్ కోర్టును ఆశ్రయించింది.
ఇందులో భాగంగా డ్యూన్స్ ఏవియేషన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో భాగంగా విమానాల భద్రత, సాంకేతిక విషయాలపై ఎలాంటి పరిజ్ఞానం లేకుండా, నిజానిజాలు సరిచూసుకోకుండా నోరా ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈమె షేర్ చేసిన ఈ వీడియో కారణంగా ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని ఏవియేషన్ సంస్థ పేర్కొంది. ఇలా తమ సంస్థకు మార్కెట్ పూర్తిగా తగ్గిన నేపథ్యంలో సదరు ఏవియేషన్ సంస్థ నటి నోరా ఫతేహి పై మూడు కోట్ల రూపాయలతో పరువు నష్టం దావా వేసింది. మరి ఈ వ్యవహారంపై నోరా స్పందన ఏంటో తెలియాల్సి ఉంది . ఇక నోరా తెలుగులో కిక్2, టెంపర్, బాహుబలి 2 పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ ద్వారా పెద్ద ఎత్తున సక్సెస్ అందుకున్నారు.
Also Read: భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి