E-Paper
Advertisement

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి.. ఈసారి కూతురు సుస్మిత‌ వంతు, దుర్గగుడి బోర్డులో ప్రత్యేక పదవి

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి.. ఈసారి కూతురు సుస్మిత‌ వంతు, దుర్గగుడి బోర్డులో ప్రత్యేక పదవి
Advertisement

Chiranjeevi: కాలం కలిసిరావడమంటే ఇదేనేమో. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి వచ్చింది. ఈసారి చిరు కూతురు సుస్మితకు బంపరాఫర్ వచ్చింది. విజయవాడ దుర్గగుడిలో పదవి దక్కించుకున్నారు. ఇంతకీ ఆ పదవి విషయాలను ఒక్కసారి చూద్దాం.

మెగాస్టార్ ఫ్యామిలీకి కాలం కలిసి వచ్చింది

నటుడు చిరంజీవి కూతురు సుస్మిత విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తర్వాత కొణిదెల సుస్మిత.. ఆలయ అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన వివిధ కార్యకలాపాలకు తనవంతు సహకారం అందించనున్నారు.

Advertisement

ఆలయానికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలను మెరుగుపరచడం, వివిధ ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో సూచనలు, సహకారం అందించనున్నారు. మరోవైపు నటుడు చిరంజీవి భార్య సురేఖ‌ తెలంగాణ‌లోని యాద‌గిరిగుట్ట బోర్డు స‌భ్యురాలిగా నియ‌మితులైన విషయం తెల్సిందే.

దుర్గగుడి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలుగా సుస్మిత

అంతకుముందు నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కింది. ఏపీ సొసైటీ ఫర్‌ గ్రీనింగ్‌ అండ్‌ రీఫారెస్టేషన్‌ ఫర్‌ ఎకలాజికల్‌ ఎన్‌రీచ్‌మెంట్‌-ఏపీ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఆయన కు క్యాబినెట్‌ హోదా కల్పించింది ప్రభుత్వం.

Advertisement

2047 నాటికి ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ-వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ కోసం ఏపీ గ్రీన్‌ సొసైటీకి కార్యనిర్వాహక కమిటీ, జిల్లాస్థాయి అభివృద్ధి సంస్థల పాలక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ ఫ్యామిలీకి పదవులు దక్కడంపై అభిమానులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు.

ALSO READ: పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

Related News

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

Big Stories

Advertisement
×