E-Paper
Advertisement

Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు

Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు
Advertisement

Vizag Summit: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో భాగంగా, తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తో ప్రత్యేకంగా భేటీ అయింది. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వారికి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీలో అందుబాటులో ఉన్న అవకాశాలను తైవాన్ (Taiwan) బృందానికి వివరించారు. వివిధ రంగాల ప్రాజెక్టులకు అనుకూలంగా పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ (ఈవీ), ఈవీ బ్యాటరీ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు.

Advertisement

ముఖ్యమంత్రి పిలుపునకు తైవాన్ కంపెనీల నుంచి అద్భుత స్పందన లభించింది. కుప్పంలో “ఇండో – తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్” ఏర్పాటుకు అలీజియన్స్ గ్రూప్ ఆసక్తి చూపింది. రూ.400 కోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపింది. అలాగే, ప్రముఖ పాద రక్షల తయారీ కంపెనీ ‘పౌ చెన్ గ్రూప్’ తమ ఫుట్‌వేర్ యూనిట్‌ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

Read Also: Visakhapatnam Future City: ఫ్యూచర్ సిటీగా విశాఖ.. చంద్రబాబు విజన్‌కి నేవీ సపోర్ట్

Advertisement

ఓర్వకల్లు ప్రాంతం సెమీ కండక్టర్లు, బ్యాటరీల తయారీకి కేంద్రంగా మారనుంది. తైవాన్‌కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్ల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఇదే ప్రాంతంలో ఇ-జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ సంచలనాత్మక ప్రతిపాదన చేసింది. ఏకంగా 2.2 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో, 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, కాథోడ్ యాక్టివ్ మెటిరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ కీలక ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు – ఈడీబీ (ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్) ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పారిశ్రామిక పార్కులకు తక్షణమే భూములు కేటాయిస్తామని, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రీజియన్లను కలుపుతూ రహదారులను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రోత్సాహకాలపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తైవాన్ కంపెనీలకు అవసరమైన మానవ వనరుల కోసం ఏపీలో “తైవాన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్” ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉందని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కొనియాడింది.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×