BigTV English

AP TG Weather Updates: ఏపీకి తుపాను ముప్పు, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. బెంగుళూరు, చెన్నైలో కుండపోత

AP TG Weather Updates: ఏపీకి తుపాను ముప్పు, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. బెంగుళూరు, చెన్నైలో కుండపోత

AP TG Weather Updates: ఏపీకి తుపాను ముప్పు పొంచి వుందా? అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారుతుందా? అధికార యంత్రాంగాన్నిఏపీ సర్కార్ అప్రమత్తం చేసిందా? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.


ఈ అల్పపీడనం చివరకు వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి ఏపీలోకి దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు వరదలు వచ్చే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడతాయని, గంటకు 70 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. బుధవారం నాడు అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది.


వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. దక్షిణ కోస్తాలో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు సహాయ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల వాసులను తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం రెడీ చేశారు.

ALSO READ: స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు.. సీఎం చంద్ర‌బాబుకు ఈడీ క్లీన్ చిట్, కాకపోతే..

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మరోవైపు వర్షాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న ప్రభుత్వం, అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.

ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ విషయానికొస్తే తెల్లవారుజామున నుంచే జల్లులు పడుతున్నాయి. ఉదయం 9 గంటలకు కాస్త తెరిపి ఇచ్చింది.

ఇదిలావుండగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల వంతైంది. ఇవి ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల్లో ప్రవేశించినట్టు తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. డిసెంబర్ వరకు ఈ సీజన్ కొనసాగనుంది.

అల్పపీడనం కారణంగా బెంగళూరు సిటీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఐటీ కంపెనీలున్న మాన్యతా టెక్‌ పార్కు రహదారులు వాగులుగా మారిపోయాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్కు సమీపంలో ఉన్న కాలువ పొంగి ప్రవాహించడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.

అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సిటీలో ఎగతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలతో నగరం అతలాకుతలమైంది. 300 ప్రాంతాలు నీట మునిగినట్టు ఓ అంచనా. కొన్ని సబ్‌వేల్లో మూడు అడుగుల మేరా నీరు చేరింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో బుధవారం కూడా రెడ్‌ అలర్ట్‌ కొనసాగతోంది.

 

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×