BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి రూంలోకి వెళ్లిన రాథోడ్‌ – రణవీర్‌, మనోహరిలను కలిపిన అంజు

Nindu Noorella Saavasam Serial Today October 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి రూంలోకి వెళ్లిన రాథోడ్‌ – రణవీర్‌, మనోహరిలను కలిపిన అంజు

Nindu Noorella Saavasam Serial Today Episode:  కొత్త డ్రెస్‌ లో మెరిసిపోతున్న అంజును చూసి పిల్లలందరూ మిస్సమ్మను మెచ్చుకుంటారు. చాలా బాగా రెడీ చేశావని చెప్తారు. అయితే నేను చాలా క్యూట్‌ గా ఉన్నాను కాబట్టే అందంగా రెడీ అయ్యాను అంటుంది అంజు. నిర్మల అంజు లాకెట్‌ తీసుకొచ్చి మిస్సమ్మకు ఇస్తుంది. అంజు మెడలో వేయమని చెప్తుంది. దుర్గామాత లాకెట్‌ చూసిన కరుణ సర్‌ప్రైజ్‌ అవుతుంది. లాకెట్‌ చాలా బాగుందని మెచ్చుకుంటుంది.


ఇంట్లోకి వచ్చిన ఆరు తాను రెడీ చేసిన గిప్ట్‌ ఎక్కడ పెట్టాలా అని చూస్తుంది. మనోహరి మాత్రం ఘోర ఇచ్చిన పొడిని ఎక్కడ కలపాలా అని చూస్తుంది. ఇంతలో పైనుంచి  అంజును రెడీ చేసుకుని కిందకు తీసుకొస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మను చూసిన ఆరు గోడ చాటుకు వెళ్లి దాక్కుంటుంది. అంజు రాగానే హాల్లో కాకరపూలు పేలతాయి. అంజు హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే అమర్‌ దగ్గరకు వెళ్లి ఈ డ్రెస్‌ చాలా బాగుంది డాడ్‌ అని చెప్తుంది.

అమర్‌, అంజును విష్‌ చేసి  నీకు నచ్చిందా? అని అడుగుతాడు. చాలా నచ్చింది అని చెప్తుంది అంజు తర్వాత అందరూ ఒక్కొక్కరుగా అంజును విష్‌ చేస్తుంటారు. నిర్మల వచ్చి అంజు పాప దేవుడికి దండం పెట్టుదువురా అని తీసుకెళ్తుంది. దేవుడికి మొక్కిన తర్వాత అంజును మీ డాడ్‌ ఆశీర్వాతం తీసుకో అని మిస్సమ్మ చెప్తుంది. దీంతో శివరాం నాన్న దగ్గరే కాదమ్మా.. మిస్సమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని చెప్తాడు. ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అంజుకు అందరితో ఆశీర్వాదం తీసుకోమని అమర్‌ చెప్తాడు.


అంజు రాథోడ్‌ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే… ఎప్పటిలాగా సున్నాలు కాకుండా సున్నాల పక్కన ఒక్కటి వచ్చేలా మార్కులు తెచ్చుకో అంటూ రాథోడ్‌ ఆశీర్వదిస్తాడు. అంజు, రణవీర్‌.. మనోహరి దగ్గర కూడా  ఆశీర్వాదం తీసుకో.. అని చెప్తాడు శివరాం. అన్ని సార్లు నేను బెండ్‌ అవ్వలేను కానీ మీ ఇద్దరు పక్కపక్న నిలబడండి అంటూ ఇద్దరిని దగ్గరకు లాగుతుంది అంజు. రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు. ఇద్దరితో కలిపి ఆశీర్వాదం తీసుకుంటుంది అంజు.

దూరం నుంచి గమనిస్తున్న ఆరు దేవుణ్ని చూస్తూ.. నీ సమక్షంలోనే అందరినీ ఒక్క దగ్గరికీ తీసుకొచ్చావా? స్వామి. ప్రేమ లేని తండ్రి, స్వార్థంతో నిండిన తండ్రి. ఇదేనా నువ్వు అంజుకు రాసిన తలరాత అంటూ ఎమోషనల్‌ అవుతుంది.  దేవుడి దగ్గర ఉన్న అక్షింతల్లో ఘోర ఇచ్చిన పొడిని కలుపుతుంది మనోహరి. ఆ అక్షింతలు తీసుకొచ్చి బయట టేబుల్‌ మీద పెట్టి దూరంగా వెళ్లి గమనిస్తుంది.

గుప్త కోపంగా ఆరును పిలుస్తాడు. అంతే కోపంగా ఆరు ఏంటి గుప్త గారు అంటూ కసురుకుంటుంది.  బహుమతి ఇచ్చి వెంటనే వస్తానని చెప్పవు.. కానీ ఇక్కడే ఉండిపోయావేంటి అని గుప్త అడగ్గానే. జస్ట్‌ అక్షింతలు తీసుకుని నా కూతురిని ఆశీర్వదించి వచ్చేస్తాను గుప్తాగారు అంటుంది ఆరు. ఇటువంటివే చేయరాదని చెప్పితిని. నా మాట వినుము. ఆ ఘోర నీకోసం ఎచ్చట ఉచ్చు పెట్టెనె తెలియడం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండవలెను బాలిక అంటూ హెచ్చరిస్తాడు గుప్త.

దేవుడి ముందు ఉన్న అక్షింతలు ఏం చేయగలవు గుప్తగారు. ఒకవేళ ఏమైనా చేసినా కూడా ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఏం కాదు అని వెళ్లి ఆరు అక్షింతల తీసుకుంటుంది. దూరం నుంచి గమనించిన మనోహరి రూంలోకి పరెగెత్తుకెళ్లి ఆరును బంధించావా అని ఘోరాను అడుగుతుంది. లేదని ఘోర చెప్పగానే మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.

నువ్వు పొడిని ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు ఘోర. దేవుడి ముందున్న అక్షింతల్లో కలిపానని మనోహరి చెప్పగానే  ఘోర కోపంగా మనోహరిని తిట్టి పవిత్రమైన దేవుడి పసుపులో కలిపితే పొడి ఎలా పనిచేస్తుంది అంటాడు. దీంతో మనోహరి నిరుత్సాహంగా కూలబడిపోతుంది. మరోవైపు అక్షింతలు తీసుకుని వెళ్లి అంజును ఆశీర్వదిస్తుంది ఆరు. ఎవరూ లేకుండా నా తల మీద అక్షింతలు పడ్డాయేంటి అని ఆంజు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తర్వాత మిస్సమ్మ, రాథోడ్ ను పిలిచి మనోహరి ఏదో దాస్తుందని కొత్తగా రూం లాక్‌ చేస్తుందని అదేంటో గమనించమని చెప్తుంది. దీంతో ఇప్పుడే తెలుసుకుంటానని రాథోడ్‌, మనోహరి రూంలోకి వెళ్లబోతాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×