Ramayan: రామాయణం వంటి అద్భుతమైన మహాకావ్యాన్ని సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రామాయణ సినిమా(Ramayan Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడి లుక్స్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రణబీర్ కపూర్ రామయ్యగా నటించగా సీతమ్మ పాత్రలో సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్నారు. ఇక రావణాసురుడి పాత్రలో కన్నడ నటుడు యష్ (Yash)నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిజానికి రణబీర్ కపూర్ ఈ సినిమాకు మొదటి ఎంపిక కాదని సమాచారం. రాముడి పాత్రలో నటించడం కోసం ముందుగా దర్శకుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ని ఎంపిక చేశారట.
రాముడిగా మహేష్ బాబు..
ఇలా రాముడి పాత్రలో మహేష్ బాబు, రావణాసురుని పాత్రలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) చేయాలని ఆయన భావించారు. ఇక ఈ విషయం గురించి మహేష్ బాబు దగ్గర ప్రస్తావించగా మహేష్ బాబు మాత్రం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి సినిమా అంటే ఇతర సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ రామాయణంలో నటించే అవకాశం వచ్చిన డేట్స్ కుదరని నేపథ్యంలో మహేష్ బాబు వదులుకున్నారని తెలుస్తోంది.
50 కోట్లతో భారీ సెట్…
ఒకవేళ మహేష్ బాబు కనుక ఈ సినిమాలో నటించి ఉంటే కచ్చితంగా మంచి విజయం తన ఖాతాలో పడేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలో మొదటిసారి మహేష్ బాబు నటిస్తున్న నేపథ్యంలో ఆయన పూర్తిగా ఈ ప్రాజెక్టు పైనే ఫోకస్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇందుకోసం రాజమౌళి ప్రత్యేకంగా ఒక సెట్ కూడా వేయించబోతున్నారట దాదాపు ఈ సెట్ కోసమే ఈయన 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఓ అడ్వెంచరస్ మూవీగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా భాగమైన సంగతి తెలిసిందే.
Also Read: Coolie Overseas Rights: భారీ ధరలు పలికిన కూలీ ఓవర్సీస్ రైట్స్… ఆల్ టైం రికార్డ్!