BigTV English
Advertisement

AP Leaders Criminal Cases Reveals: ఏపీలో నేతలంతా కోటీశ్వరులే.. కాకపోతే క్రిమినల్ కేసులు కూడా..!

AP Leaders Criminal Cases Reveals: ఏపీలో నేతలంతా కోటీశ్వరులే.. కాకపోతే క్రిమినల్ కేసులు కూడా..!

Andhra Pradesh Political Leaders Criminal Cases Reveals: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల చివరి అంకానికి చేరుకోవడంతో పార్టీల గుట్టు బయటపడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు 94 శాతం మంది కోటీశ్వరులే. ప్రధాన పార్టీల తరపున దాదాపు 604 మంది రేసులో ఉన్నారు.


వారిలో వైసీపీ, టీడీపీ, జనసేన తరపున 307 మంది ఉన్నారు. వైసీపీ తరపున -165 మంది, టీడీపీ నుంచి -134, జనసేన నుంచి -18, బీజేపీ నుంచి ఎనిమిది, కాంగ్రెస్ నుంచి -79 మంది, సీపీఎం, సీపీఐ నుంచి ఒకొక్కరు చొప్పున కోటీశ్వరులున్నారు.

అన్ని పార్టీల అభ్యర్థుల సగటు ఆస్తి యావరేజ్ ఎనిమిది కోట్ల రూపాయలుగా పేర్కొంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ అభ్యర్థులు కోట్లకు పడగలెత్తినవాళ్లనని అసోషియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. అత్యధిక ఆస్తులున్న అభ్యర్థుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు-931 కోట్లు, మాజీ మంత్రి నారాయణకు- 824 కోట్లు, సీఎం జగన్‌కు- 757 కోట్లతో మూడో ప్లేస్‌లో నిలిచారు.


Also Read: Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..

AP assembly polls Ysrcp and TDP candidates are crore patis says ADR report
AP assembly polls Ysrcp and TDP candidates are crore patis says ADR report

ఇక సీఎం జగన్ కుటుంబానికి ఏడాదికి 73 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. జగన్ ఒక్కరికే ఏడాదికి 57 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొంది. సెకండ్ ప్లేస్‌లో టీడీపీ అభ్యర్థి జనార్థన్‌రెడ్డి 37 కోట్లు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి 34 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అందులో ప్రస్తావించింది.

Also Read: ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు, జగన్, చంద్రబాబు, ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీ

మొత్తం అసెంబ్లీకి పోటీ చేస్తున్న 543 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు వున్నాయి. వాటిలో 374 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్నవారి సంఖ్య 331 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది.

తీవ్రమైన క్రిమినల్ కేసులకు సంబంధించి గత ఎన్నికల్లో 220 మందిపై కేసులుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 374కు చేరింది. అందులో వైసీపీ నుంచి 87 మంది, టీడీపీ-42, జనసేన -10, బీజేపీ-8, సీపీఎం, సీపీఐ ఐదుగురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి.

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×