BigTV English

Krishna River Water: కదిలివస్తున్న కృష్ణమ్మ.. కర్ణాటక నుంచి తెలంగాణకు నీరు విడుదల!

Krishna River Water: కదిలివస్తున్న కృష్ణమ్మ.. కర్ణాటక  నుంచి తెలంగాణకు నీరు విడుదల!

దీంతో జూరాలలో నీళ్లు అడుగంటాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే రంగంలోకి దిగింది కర్ణాటకతో సంప్రదింపులు జరిపింది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. కర్ణాటక తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటకలోనే తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నాయి. మనం బెంగళూరు వాటర్ కష్టాల గురించి చూస్తూనే ఉన్నాం. స్నానాలు చేయడానికి కండిషన్స్ పెట్టే పరిస్థితి.. బట్.. కర్ణాటక సర్కార్‌ తెలంగాణ ప్రభుత్వ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసింది.. నీటిని విడుదల చేసింది.

ఎందుకు? తామే పుట్టేడు కష్టాల్లో ఉంటే.. పక్క రాష్ట్రం గురించి పట్టించుకోవాల్సిన అవసరం కర్ణాటకకు ఏముంది? ఇదే కదా మీకు వచ్చిన డౌట్.. పాలించేవాడు కరెక్ట్‌గా ఉంటే ఇలానే జరుగుతుంది. ఎందుకీ మాట చెబుతున్నామంటే.. రేవంత్ సర్కార్‌ రాబోయే నీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసింది. అందుకే అప్పుడే కర్ణాటక ప్రభుత్వానికి మార్చిలోనే ఈ రిక్వెస్ట్‌ పెట్టారు. ఆ తర్వాత పలుసార్లు చర్చలు జరిపారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులతో రేవంత్‌ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇది అందరికీ తెలిసిందే.. అందుకే ఈ నీటి విడుదల సాధ్యమైంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరింది. కానీ అక్కడి పరిస్థితులన్నింటిని అంచనా వేసుకొని.. మొదట 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది కర్ణాటక.. దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి చొరవ క్లియర్‌ కట్‌గా కనిపిస్తుంది.


Also Read: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ జోరు..

నారాయణపూర్‌ నుంచి జూరాల ప్రాజెక్ట్‌కు మధ్య ఉన్న దూరం 55 కిలోమీటర్లు మాత్రమే.. బట్.. 1.9 టీఎంసీల నీరు జూరాలకు చేరుకునే సరికి కేవలం ఒకటిన్నర టీఎంసీ మాత్రమే అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చే నీటితో మూడు నెలల పాటు నీటి అవసరాలు తీరుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో ఉన్న నీటితో ఈ నెల 15 వరకు తాగు నీరు అందించే అవకాశం ఉంది. అందుకే చర్చలను స్పీడప్ చేసింది ఫలితం కనిపించింది.

అయితే 2019లో కూడా ఇలానే నీటిని విడుదల చేశారు. బట్ అప్పుడు కర్ణాటక ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉండేది. కానీ కర్ణాటక నీటి ఎద్దడిలో ఉన్నప్పుడు కూడా నీటిని విడుదల చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్.. వర్షాకాలంలో నీరు దిగువకు విడుదల చేయడం కామనే.. కానీ ఇలా నీటి ఇబ్బందుల కారణంగా తెలంగాణ రిక్వెస్ట్ చేయడం.. కర్ణాటక పాజిటివ్‌గా స్పందించి నీటిని రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.. గత బీఆర్‌ఎస్‌ పాలనలో కర్ణాటకతో ఉప్పు నిప్పు అన్నట్టుగానే వ్యవహరించింది. కానీ ఇప్పుడు పాలకులు మారారు. పరిస్థితులు మారాయి. దీనికి రిజల్టే.. ఇప్పుడు నారాయణపూర్‌ నుంచి జూరాలకు చేరుతున్న నీరు.

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×