BigTV English

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

TDP Pulivarthi Sudha Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్​రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో తమ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఆమె ఖండించారు.


ఆధారాలు లేని ఆరోపణలా…

ఎక్కడో ఏదో జరిగితే, ఆధారాలు లేకుండా తమ కుటుంబ సభ్యులు పేర్లు ప్రస్తావించడం బాధాకరమన్నారు. గ్రూపుల్లో తన పేరు ప్రస్తావించడంతో వాట్సాప్ గ్రూపు అడ్మిన్’లకు ఫోన్ చేసి చెప్పామన్నారు. అవినీతి ఆరోపణలపై అదే వాట్సాప్ గ్రూపులో రిప్లై ఇస్తే తమ మెసేజ్’లను కావాలని డెలీట్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న అడ్మిన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విచారణలో భాగంగా ఫోన్ నెంబర్లు పరిశీలిస్తే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అని తెలిసిందన్నారు. మిమ్మల్ని చంపాలని చూసిన చెవిరెడ్డికి తప్పుడు మెసేజ్’లు పెట్టడం లెక్కలేదన్న సుధారెడ్డి, గత 5 ఏళ్లలో ఆయన అవినీతి కూపంలో కూరుకుపోయరన్నారు.


100 ఎకరాల ఆసామి మేం…

మా తాతకే 100 ఎకరాల ఆస్తి ఉంది, మా నాన్న డిఎస్పీగా పనిచేసినా అవినీతికి పాల్పడలేదన్నారు. చెవిరెడ్డి రూ.7 వేలకు జనచైతన్యలో కమీషన్ ఏజెంట్ గా పనిచేశారని చెప్పిన సుధారెడ్డి, తమకు చెవిరెడ్డికి చాలా తేడా ఉందన్నారు. ఆయన నిన్నమొన్న డబ్బులు చూశారని, తాము డబ్బుల్లో పుట్టి పెరిగామన్నారు. బయటకు రాలేక ఎమ్మెల్యే పులివర్తి నానిపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. పులివర్తి నాని మేనమామ అప్పట్లోనే గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారని, అలాంటి తమపై తప్పుడు మెసేజ్ లు పంపితే ఉపేక్షించేది లేదన్నారు. చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తామన్నారు.

Also read : ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×