Bigg Boss 18 Elimination: బిగ్ బాస్ అనేది ఫారిన్ భాషలో ప్రారంభమయిన రియాలిటీ షో అయినా దానిని ముందుగా ఇండియాలో ప్రవేశపెట్టింది మాత్రం హిందీ మేకర్సే. హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షోను ప్రారంభించి ఒక్కసారిగా దానిపై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సీజన్ తర్వాత సీజన్ సాగిపోతూనే ఉంది హిందీ బిగ్ బాస్. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. కానీ మొదటిసారి అలాంటి కాంట్రవర్సీలకు హిందీ బిగ్ బాస్ మేకర్స్ తలవంచాల్సి వచ్చింది. ఇవన్నీ తట్టుకోలేక ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. అది మరెవరో కాదు.. ఒక గాడిద.
జోక్ కాదు నిజమే
హిందీలో బిగ్ బాస్ ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా 17 సీజన్స్‌ను పూర్తిచేసుకుంది. తాజాగా సీజన్ 18 కూడా ప్రారంభమయ్యింది. పేరుకు తగినట్టుగానే సీజన్ 18లోకి 18 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఎవరూ ఊహించని విధంగా 19వ కంటెస్టెంట్‌గా ఒక గాడిదను తీసుకొచ్చారు. దాని పేరే గదరాజ్. బిగ్ బాస్ హౌస్‌లోకి దానిని కంటెస్టెంట్‌గా పంపిస్తారని చెప్పగానే ప్రేక్షకులంతా జోక్ అనుకున్నారు, నమ్మలేదు. కానీ నిజంగానే గదరాజ్‌ను హౌస్‌లోకి పంపించారు. దానిని అక్కడే ఒక చోట కట్టేశారు. ఎంతైనా అది మనిషి కాదు కాబట్టి, సొంతంగా పనులు చేసుకోలేదు కాబట్టి కంటెస్టెంట్సే అన్ని విషయాల్లో గదరాజ్‌కు సాయం చేశారు.
Also Read: కిర్రాక్ సీత ఎలిమినేట్.. 6 వారాలలో ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే..?
జాతీయ సంస్థ ఆగ్రహం
కంటెస్టెంట్సే గదరాజ్‌కు నీళ్లు, గడ్డి పెట్టడం లాంటివి చేశారు. దీంతో అది చూసిన పెటా అంటే పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థకు కోపమొచ్చింది ఇది ఒక జాతీయ సంస్థ. బిగ్ బాస్ నుండి గాడిదను కంటెస్టెంట్‌గా పంపించేయాలని పెటా డిమాండ్ చేసింది. అయినా కూడా ఆ సంస్థ కోపాన్ని పట్టించుకోకుండా వారం రోజుల పాటు గదరాజ్‌ను కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోనే పెట్టారు మేకర్స్. ఫైనల్‌గా పెటాకు బిగ్ బాస్ మేకర్స్ తలవంచక తప్పలేదు. తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో గదరాజ్‌ను ఎలిమినేట్ చేసేశారు. బిగ్ బాస్ 18కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ విషయంపై పెటా నుండి లేఖ అందింది.
వారి బదులుగా
పెటా ఆదేశాలతో మొత్తానికి బిగ్ బాస్ 18 నుండి గదరాజ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ఇక బిగ్ బాస్ 18 మొదటివారం నామినేషన్స్‌లో చాహత్ పాండే, గుణరత్న సదవర్తె, కరణ్ వీర్ మెహ్రా, అవినాష్ మిశ్రా, ముస్కన్ బామ్నే ఉన్నారు. అసలైతే ఓటింగ్ విషయంలో వీరందరిలో లాస్ట్‌లో ఎవరు ఉన్నారో వారు ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ వారి బదులుగా గదరాజ్‌ను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది బిగ్ బాస్ మేకర్స్. ఫైనల్‌గా పెటా అనుకున్నట్టుగానే జరిగింది. ఇక ప్రేక్షకులు కూడా గదరాజ్‌ను కంటెస్టెంట్‌గా తీసుకురావడం వల్ల ఇతర కంటెస్టెంట్స్‌కు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉందని, దానిని ఎలిమినేట్ చేయడమే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.