E-Paper
Advertisement

Devara OTT : అప్పుడే ఓటీటీలోకి ‘ దేవర ‘.. స్ట్రీమింగ్ డేట్ లాక్?

Devara OTT : అప్పుడే ఓటీటీలోకి ‘ దేవర ‘.. స్ట్రీమింగ్ డేట్ లాక్?
Advertisement

Devara OTT : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సోలోగా ఆరేళ్ళ తర్వాత  వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ దేవర ‘.. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలోకి వచ్చి భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ ఎప్పటిలాగే సునామీ సృష్టించాయి. 16 రోజులకు గాను రూ. 506 కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఈ మూవీ థియేటర్లలో ఇంకా రన్ అవుతుంది. కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక స్టార్ హీరోల సినిమాలు  రిలీజ్ అయిన రెండు నెలలకు ఓటీటీలోకి వస్తాయి. కానీ ఈ మూవీ మాత్రం ఒక్క నెలకే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. దేవర ఓటీటి డిటైల్స్ గురించి ఓసారి తెలుసుకుందాం..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర సెప్టెంబర్ 27న రిలీజై టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీ రిలీజ్ టైంలో పోటీగా ఎటువంటి పెద్ద సినిమాలు లేకపోవడం ఈ మూవీకి ప్లస్ అయ్యింది. అందుకే కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ మూవీని మళ్లీ మళ్లీ చూడాలని ఓటీటి అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారందరికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఓటీటి స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేశారు. దసరా టైం లో థియేటర్ లో దేవరకు కలిసి వచ్చేలా ఉండగా మంత్ ఎండింగ్ కల్లా దేవర బాక్సాఫీస్ రన్ ముగిసేలా ఉంది. అందుకే సినిమాను అక్టోబర్ 30 న డిజిటల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమా ఓటీటీ రిలీజైతే అక్కడ కూడా రికార్డులు కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

Advertisement

ఆ డేట్ ను తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 30 స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక్కడ మంచి టాక్ ను అందుకున్న దేవర అక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. దేవర సినిమాకు అనిరుద్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ ఒక లెవెల్ కాగా అనిరుద్ మ్యూజిక్ దాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. దేవర సినిమా పార్ట్ 1 రిజల్ట్ తేలిపోగా ఆడియన్స్ అంతా ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ఏదైన కొరటాల శివ మ్యాజిక్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఇప్పటినుండి వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×