E-Paper
Advertisement

AP CM Chandrababu: అమ్మ ఈ శారీ ప్యాక్ చెయ్.. సతీమణికి చీర కొన్న చంద్రబాబు

AP CM Chandrababu: అమ్మ ఈ శారీ ప్యాక్ చెయ్.. సతీమణికి చీర కొన్న చంద్రబాబు
Advertisement

AP CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు నిర్వహించిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అరటి వ్యర్ధాలతో తయారు చేసిన టోపీని ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు.

మన మహిళలు విశ్వ విపణిపై రాణించాలి.. ప్రతి ఒక్కరూ ఆర్ధిక స్వావలంబన సాధించాలి.. ఏడాదిలో లక్షమంది పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి.. బహిరంగ ప్రదేశాల్లో వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి.. ఒక్క క్లిక్ తో.. వారి ముందు పోలీసులు నిలబడి సాయమందించాలి.. ఈ దిశగా ఒక మహిళా శక్తి యాప్.

Advertisement

రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉండాలని, ఆర్ధిక శక్తిగా ఎదగాలనీ, జాతీయ- అంతర్జాతీయ వేదికలపైనా.. వీరు సత్తా చాటాలనే లక్ష్యంతో.. మహిళలకు అండదండలు అందించే కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదకొండున్నర లక్షల మందికి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చి పెట్టనున్నారు. అంతే కాదు మహిళల కోసం శ్రీశక్తి పేరిట ఒక కొత్త యాప్ రూపకల్పన చేశారు.

Advertisement

Also Read: ఆ పిల్లాడికి నారా లోకేష్ సాయం.. కానీ, ఆ అబ్బాయి చెప్పేదంతా అబద్దమా?

దీంతోపాటు చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్ధాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందని సీఎం పేర్కొన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అయితే అక్కడ నిర్వహించిన ఓ వస్త్ర దుకాణంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోసం చీర కొన్నారు. ఆ తర్వాత ఈ- వ్యాపారి పోర్టల్ డెలివరీని సీఎం ప్రారంభించారు.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×