Chiranjeevi ..మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తన తమ్ముడు నాగబాబు (Nagababu), తల్లి అంజనమ్మ (Anjanamma) తో పాటు చెల్లెళ్ళు విజయదుర్గ (Vijaya Durga) ,మాధవి(Madhavi) తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తమ చిన్ననాటి విషయాలను పంచుకున్నారు.ఇప్పటికీ కలిసుండడంపై కామెంట్లు చేసి, ఆ తర్వాత తాము ఐదుగురం కాదు 8 మంది సంతానం అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మెగా ఫ్యామిలీ అనగానే మనకు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పాటు వీరి సోదరీమణులు విజయదుర్గ , మాధవి మాత్రమే గుర్తుకొస్తారు. కానీ మరో ముగ్గురు ఉండేవారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మా అమ్మ ముగ్గురు పిల్లల్ని కోల్పోయింది..
ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి అందులో భాగంగానే మాట్లాడుతూ.. “మా చిన్నప్పుడు అంతా సంతోషమే కాదు దుఃఖం కూడా ఉంది.మా అమ్మకి 8 మంది పిల్లలు. అందులో ముగ్గురు చనిపోయారు. అందులో నాకు బాగా గుర్తుండే అమ్మాయి రమా.. తనకి రెండున్నర సంవత్సరము. నాన్న డ్యూటీలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేవారు. అమ్మ, నేను, వీరంతా కూడా ఇంకా చిన్న పిల్లలే. అయితే రమాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాము.అక్కడ చికిత్స అనంతరం కోలుకుంటుందని అందరం అనుకున్నాము. కానీ అనూహ్యంగా ఆ అమ్మాయి చనిపోయింది. ఇక దాంతో అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. ఇక నాన్నకు చెబుతామంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియని పరిస్థితి. ఇక దాంతో నేను అమ్మను ఒక చేత్తో, మరొకవైపు ఈ పిల్లలను ఒడిలో చనిపోయిన పాపను పెట్టుకొని రిక్షాలో ఇంటికి చేరుకున్నాను. అక్కడికి వెళ్తే ఏం చేయాలో.. ఎలా చేయాలో.. దహన సంస్కారాల పరిస్థితి ఏంటి అనే విషయాలు ఏవి నాకు తెలియదు. పైగా మా ఇంటి పక్కనే మసీదు ఉండేది. ఇక మా పరిస్థితి చూసిన చుట్టుపక్కల ముస్లిం సోదరులు అందరూ మా దగ్గరికి వచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి.. నాన్న వచ్చేవరకు మాకు కాస్త అండగా నిలిచారు. ఆ బాధ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది” అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు చిరంజీవి.
Also read:Pradeep Ranganathan : రజినీలా మారిపోయిన కుర్ర హీరో… దెబ్బకు గంధీ బాత్ హీరోయిన్ ప్లాట్
తల్లి కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయినా చిరు..
ముఖ్యంగా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత వారు చనిపోయారు అని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే తన తండ్రి డ్యూటీ పరంగా బిజీగా ఉండగా.. తమ బాధ్యతను భుజాన వేసుకొని ఎన్నో కష్టాలు పడిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలా అంజనమ్మ ముగ్గురు పిల్లలను కోల్పోయి ఇప్పుడు ప్రస్తుతం పిల్లలతో, మనవళ్లతో, మనవరాళ్ళతో, ముని మనవరాలుతో సంతోషంగా గడుపుతోంది. మొత్తానికైతే నాడు అంజనమ్మ పడ్డ కష్టాలను ఒక్కొక్కటిగా చెప్పుకొస్తూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఒక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. అందులో భాగంగానే ‘విశ్వంభర’ సినిమాతో ఈ సమ్మర్ హాలిడేస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.