BigTV English

Sharmila Fires on Jagan : జగన్ వైఎస్సార్ వారసుడా ? లేక కేంద్రానికి వారసుడా ? : షర్మిల ఫైర్

Sharmila Fires on Jagan : జగన్ వైఎస్సార్ వారసుడా ? లేక కేంద్రానికి వారసుడా ? : షర్మిల ఫైర్

PCC Chief Sharmila Fires on Jagan(AP political news) : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. తన చెల్లెలని అని కూడా చూడకుండా విమర్శలు చేయడంపై ఆమె ఘాటుగా స్పందించారు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడిని కలిసిన షర్మిల వైఎస్సార్ వారసులారా ? అని జగన్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారామె. YSR బిడ్డ, మీ చెల్లి అని చూడకుండా.. నా గురించి ఎందుకు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మీడియా ముఖంగా ప్రశ్నించారు.


కుక్క బిస్కెట్లు పడేసి.. సోషల్ మీడియాలో కథనాలు అల్లుతున్నారని వాపోయారు. చిన్నాన్నను చంపించిన హంతకుడికి టికెట్ ఇచ్చినందుకే తాను పోటీలో నిలబడ్డానని.. నేను ఓడిపోతాననే నమ్మకం మీకు ఉంటే.. మీరు ఎందుకు భయపడుతున్నారని జగన్ కు సూటి ప్రశ్న వేశారు.

Also Read : సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు


తమపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు.. వైఎస్సార్ పేరును కూడా ఛార్జిషీట్ వేశారని వాపోయారు. వైఎస్సార్ పేరును ఛార్జిషీట్ లో చేర్చడం.. జగన్ చేసిన దుర్మార్గపు చర్య అని షర్మిల మండిపడ్డారు. ఈ ఎన్నికలు ధర్మానికి, డబ్బుకి మధ్య జరుగుతున్నవని.. ధర్మమే గెలుస్తుందని షర్మిల తెలిపారు. ఐదేళ్లుగా జగన్ రిమోట్ కంట్రోల్ ప్రధాని మోదీ చేతిలో ఉందని, ఆ రిమోట్ ను ఎలా నొక్కితే జగన్ అలా ఆడుతున్నారని విమర్శలు చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×