BigTV English
Advertisement

Shreyas Iyer: 3 వేల పరుగుల మార్క్ దాటిన.. శ్రేయాస్

Shreyas Iyer: 3 వేల పరుగుల మార్క్ దాటిన.. శ్రేయాస్

Shreyas Iyer Completes 3000 Runs In IPL during KKR vs DC Match: ఐపీఎల్ సీజన్ 17లో కోల్ కతా ఎవరూ ఊహించని విధంగా రాణిస్తోంది, తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్ కెరీర్ లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు. ఢిల్లీ పై 23 బాల్స్ లో 33 పరుగులు చేసి, జట్టుని గెలిపించాడు. అలాగే  ఓవరాల్ గా 3,027 పరుగులు చేశాడు.


ఈ ఫీట్ ని 110 మ్యాచ్ ల్లో పూర్తి చేయడం విశేషం. యావరేజ్  32.20 ఉంటే స్ట్రయిక్ రేట్ మాత్రం 126.28 ఉంది. ఇందులో 20 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే హయ్యస్ట్ స్కోరు 96 పరుగులుగా ఉంది. 4 పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

కోల్ కతా తరఫున ఇంతవరకు 23 మ్యాచ్ లు ఆడిన అయ్యర్ టోటల్ గా 652 పరుగులు చేశాడు. యావరేజ్ 34.52 గా ఉంది. ఇక స్ట్రయిక్ రేట్ చూస్తే 135.55 గా ఉంది. అత్యధిక పరుగులు 85 గా ఉన్నాయి.


Also Read: ప్రపంచకప్‌‌కు ఎవరెవరు? ఆటగాళ్లలో టెన్షన్, కాకపోతే..

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో ఇంతవరకు 9 మ్యాచ్ లు ఆడి 251 పరుగులు చేశాడు.  ఇక్కడ యావరేజ్ 41.83 గా ఉంటే, స్ట్రయిక్ రేట్ 137.16 గా ఉంది. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ 50 పరుగులతో ఉంది.

ఐపీఎల్ మొత్తమ్మీద టాప్ స్కోరర్ గా విరాట్ కొహ్లీ ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ ఇంతవరకు 7,763 పరుగులు చేశాడు. తన యావరేజ్ 38.43 గా ఉంది. స్ట్రయిక్ రేట్ 131.02 గా ఉంది. తన బెస్ట్ స్కోరు 113 నాటౌట్ గా ఉంది. ఇకపోతే ఇంతవరకు 8 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు చేశాడు.

29 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ తనకి ఉన్న గాయాల రీత్యా మహా అయితే మరో ఐదు నుంచి ఆరేళ్లు కెరీర్ కొనసాగించగలడని అంటున్నారు. ఇకపోతే ఐపీఎల్ లో శ్రేయాస్ 2015లో ఎంటర్ అయ్యాడు. తన ప్రస్తుత ధర రూ.12.25 కోట్లుగా ఉంది.

పదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న శ్రేయాస్ కెరీర్ లో చూస్తే.. 2020 లో తన ఇండివిడ్యువల్ ఓవరాల్ హయ్యస్ట్ స్కోరు 519 పరుగులుగా ఉంది. తర్వాత నాలుగు సార్లు 400 దాటించాడు. 439 (2015),  434 (2018), 463(2019), 401 (2022) ఇలా చేసుకుంటూ వెళ్లాడు. ఒకసారి 2017లో మాత్రం 338 పరుగులు చేశాడు.

అయితే 2016లో మాత్రం 6 మ్యాచ్ లు ఆడి కేవలం 30 పరుగులు చేశాడు. అటు తర్వాత 2021లో 8 మ్యాచ్ లు ఆడి 175 పరుగులు చేశాడు. ఇది శ్రేయాస్ అయ్యర్ కెరీర్ సాగిన తీరు అని చెప్పాలి. ప్రస్తుతం బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయాస్ మళ్లీ తిరిగి టీమ్ ఇండియాలోకి త్వరలోనే రావాలని మనం కూడా కోరుకుందాం. ఆల్ దిబెస్ట్ చెబుదాం.

Related News

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Big Stories

×