BigTV English

Pawan Kalyan: ఆ స్కీమ్‌కు ఎన్టీఆర్ పేరే పెడదామా?.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే

Pawan Kalyan: ఆ స్కీమ్‌కు ఎన్టీఆర్ పేరే పెడదామా?.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే

Pawan kalyan latest news(Andhra Pradesh news today): ఆంధ్రప్రదేశ్ ఈ నెల 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నది. 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ఇది వరకే నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ క్యాంటీన్లకు ఏ పేరు పెడితే బాగుంటుందనే చర్చ వచ్చింది. ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలా? లేక డొక్కా సీతమ్మ పేరును జోడించాలా? అనే చర్చ జరిగింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. నేటి కేబినెట్ సమావేశం అనంతరం, ఈ ఆసక్తికర చర్చ జరిగింది.


2019 వరకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఉండేవని, ఇకపై కూడా అలాగే కొనసాగించడం ఉత్తమం అని పవన్ కళ్యాణ్ సూచించారు. అపర అన్నపూర్ణగా ఖ్యాతి పొందిన డొక్కా సీతమ్మ పేరును.. పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటికే నిర్ణయించామని వివరించారు. కాబట్టి, క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరునే కొనసాగించడం బెటర్ అని, ఎన్టీఆర్ పేరే సరైందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Also Read: ఏడాదిలో తన పెళ్లంటూ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన నటి


మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం వల్ల ఆమె గొప్పదనం ప్రతి విద్యార్థికి తెలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయడ్డారు. ఇది భవిష్యత్ తరాలకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో 100 చోట్ల క్యాంటీన్లు పెట్టనున్నారు. రెండో విడతలో 83 చోట్ల, మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లు ప్రారంభిచనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ 203 క్యాంటీన్లకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆహారాన్ని సరఫరా చేస్తుంది. అల్పాహారంతోపాటు భోజనాన్ని కూడా హరే కృష్ణ ఫౌండేషన్ సరఫరా చేయనుంది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×