Amaravati: ఏపీ డీఎస్సీ-2025 వ్యవహారం అధికార-విపక్షం మధ్య మాటల యుద్ధం ముదిరింది. బిగ్ టీవీ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఒకరిపై మరొకరు అస్త్రాలు విసురుకుంటున్నారు. ఏపీవ్యాప్తంగా డీఎస్సీపై రచ్చ జరుగుతున్నా, ఆ శాఖ మంత్రి లోకేష్ ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్ మాటలకు కౌంటరిచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?
డీఎస్సీ వ్యవహారంపై ఏపీలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. డీఎస్సీపై మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. దీనిపై సదరు మంత్రి ప్రత్యేకంగా ఓ వీడియో ఎక్స్ వేదికగా విడుదల చేశారు. డీఎస్సీ నిర్వహణ, పోస్టుల భర్తీ, ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో వినిపించారు.
గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని వివరించారు. ఈ విషయంలో కావాలనే తనపై ఆరోపణలు చేస్తు్న్నారని మండిపడ్డారు. తనపై విమర్శలు చేసే ముందు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని డీఎస్సీలు నిర్వహించిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ-డీఎస్సీకి తేడా తెలియని మీరు, నన్ను ప్రశ్నిస్తున్నారని ఎదురుదాడి చేశారు.
2029 నాటికి మరో మూడు డీఎస్సీలు నిర్వహించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డీఎస్సీ అంశంపై కొన్నాళ్లుగా అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై అభ్యర్థులు మీడియా ముందుకొచ్చి నిజాలు బయటపెడుతున్నా, దీనిపై కనీసం మాట్లాడలేదు మంత్రి లోకేష్. ఈ విషయంలో అధికారుల్లో కదలిక మొదలైందని చెప్పవచ్చు.
అక్రమాలకు సంబంధించి ఇప్పటికే బిగ్ టీవీ వివరాలతో బయటపెట్టింది. కర్నూలు జిల్లా ప్రభాకర్ విషయంలో నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి విచారణకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై శాప్ కార్యాలయంలో అభ్యర్థుల జాబితాను దగ్గర పెట్టుకుని సర్టిఫికెట్లను వెరిఫై చేస్తున్నారు. టీవీ కథనాలపై మంత్రి లోకేష్ రియాక్ట్ కావాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ALSO READ: ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు