Babloo Prithveeraj In Raaka:ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ప్రత్యేకించి కొన్ని బడా ప్రాజెక్టు చిత్రాలు ఆడియన్స్ లో ఊహించని హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కథ, హాలీవుడ్ స్థాయి విజువల్స్, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు, నటీనటులు సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో అల్లు అర్జున్ (Allu Arjun) రాకా (Raaka) చిత్రం కూడా ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee ) దర్శకత్వంలో రాబోతున్న పాన్ వరల్డ్ ప్రెస్టేజియస్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalhanidhi Maran) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్గా నటిస్తోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో నెగిటివ్ షేడ్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రోజుకొక అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా హాల్లో బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithveeraj) కూడా నటిస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన స్వయంగా స్పందించి, అభిమానులను సర్ప్రైజ్ చేశారు. “అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాకాలో నేను కూడా నటిస్తున్నాను. ముఖ్యంగా అల్లు అర్జున్ గ్లామర్ క్వీన్ దీపికా పదుకొనేతో కలిసి నటించే స్పెషల్ సన్నివేశాలలో నేను నటిస్తున్నాను.ముఖ్యంగా అల్లు అర్జున్ తో నటించడంతో నా పెద్ద కల నిజమైనట్లు అనిపిస్తోంది.
ఈ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి విజువల్స్, సాంకేతిక నిపుణులు, స్టార్ నటీనటులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ కథ గురించి బయట పెట్టాలని, నా పాత్ర గురించి చెప్పాలని ఉన్నప్పటికీ ఈ కథ సీక్రెట్స్ బయట పెట్టకుండా ఉండేందుకు షూటింగ్ మొదటి రోజే ఒక బౌండ్ బుక్ ఇచ్చి నాతో సంతకం చేయించుకున్నారు. అందుకే నేను నటిస్తున్న పాత్ర గురించి పెద్దగా చెప్పలేకపోతున్నాను. కానీ నా పాత్ర మాత్రం సినిమాలో చాలా కీలకం చాలా యూనిక్ గా ఉంటుంది. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా డీటెయిల్ గా తీస్తున్నారు. శ్రద్ధతో వివరంగా రూపొందిస్తున్నారు. ఆడియన్స్ మాత్రమే కాదు నేను కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా.. చూడాలా ..అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను” అంటూ తెలిపారు.
ALSO READ: బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?
ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ నటన.. సెట్స్ లో ఆయన చూపించే ఎనర్జీని నేను కళ్ళారా చూశాను. ముఖ్యంగా అదొక అద్భుతమైన అనుభూతి.. రాకా వచ్చినప్పుడు యావత్ సినీ ప్రపంచం అబ్బుర పడిపోతుంది. ముఖ్యంగా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన నిపుణులు ఈ సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నారు” అంటూ ఆయన తెలిపారు.