E-Paper
Advertisement

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ
Advertisement

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి, ఇతర ముడిపదార్థాల వాడకంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని జగన్ లేఖలో కోరారు.

తన రాజకీయాల కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ చేసిన పనుల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఎంతో సున్నితమైన విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, సీఎం పదవికే మచ్చతెచ్చేలా ప్రవర్తించారని లేఖలో రాశారు. అంతేకాకుండా టీటీడీ సంప్రదాయాలపైనే అందరికీ అనుమానాలొచ్చేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

గతంలోనూ జగన్ ప్రధానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో.. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, ఆస్తుల ధ్వంసం పెరిగిందని, ఇంకా రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ జులైలో ప్రధానికి లేఖ రాశారు జగన్.

Advertisement

కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం బీజేవైఎం నేతలు జగన్ ఇంటి ఎదుట నిరసన చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు.

 

 

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×