BigTV English
Advertisement

AP Housing Scheme: ఉచితంగా ఇంటి స్థలం.. ఈ రూల్స్ మాత్రం మరచిపోవద్దు!

AP Housing Scheme: ఉచితంగా ఇంటి స్థలం.. ఈ రూల్స్ మాత్రం మరచిపోవద్దు!

AP Housing Scheme: ఏపీలోని పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంటి స్థలాలు లేని పేదలకు స్థలం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.


ఈ పథకం ద్వార లబ్ది పొందేందుకు గల అర్హతలను, లబ్దిదారులను ఎంపిక చేసే విధానంపై కూడ ప్రభుత్వం తగు మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేమిటంటే.. పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇస్తారు.

ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడుగా ప్రకటించిన ప్రభుత్వం, పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలని సూచించింది. ప్లాటును ఆధారు, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి.


అలాగే అర్హతలుగా.. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొంది ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ది పొంది ఉండకూడదు. అయిదు ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులని ప్రకటన విడుదలైంది.

ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ చేయనున్నారు. గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇంటి స్థలం పొందినా ఇల్లు నిర్మించని వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయిస్తారు.

Also Read: PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

ఇక పథకం ద్వార లబ్దిదారులను ఇలా ఎంపిక చేస్తారు. మొదటగా దరఖాస్తుదారుడు విలేజి, వార్డు స్ధాయిలో ధరఖాస్తు చేసుకోవాలి. వీఆర్వో, ఆర్‌‌ఐల ద్వారా విచారణ చేయించాలి. లిస్టును గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది జాబితాను ఎమ్మార్వోలు, మున్సిపల్ కమీషనర్‌లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌లకు పంపాలి. లబ్దిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామల్లో భూమి స్ధలం కేటాయింపుకు కలెక్టర్‌కు అధికారాలు ఉంటాయి. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయించారు. రెండేళ్లలో నిర్మాణం చేపట్టని సైట్స్‌ను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×