BigTV English

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

PM Kisan Scheme: రైతన్నల కోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న లక్ష్యంతో రైతుల కోసం పీఎం కిసాన్ నగదును జమ చేస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ గురించి సరైన అవగాహన లేక లబ్ది పొందలేక పోతున్నారని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం 2019లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం దేశంలోని రైతులందరికీ లబ్ది చేకూర్చేందుకు పథకం అమలు చేస్తోంది. అందుకే రైతులు పథక లబ్ది కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.


ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 6 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2 వేలు జమ చేస్తారు. అయితే అందుకు రైతన్నలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే రైతుల ఖాతాలలో నగదు జమ కావడం ఖాయం. అయితే పీఎం కిసాన్ 19 వ విడత నగదును కేంద్రం ఫిబ్రవరిలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఇంకా చాలా మంది రైతులు ఈ కేవైసీ పై సరైన అవగాహన లేక సరైన సమయానికి చేయించుకోక పోవడంతో, నగదు జమ కాలేదని చెప్పవచ్చు. అటువంటి రైతులందరూ ఈనెల 31 లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అప్పుడే 19 వ విడతలో జమ అయ్యే రూ. 2 వేల నగదు ఖాతాకు చేరుతుందని, ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని కేంద్రం ప్రకటించింది. అయితే సులభ పద్దతిలో ఈ కేవైసీ చేయించుకోవచ్చని, అందుకు pmkisan.gov.in సైట్ లో సులభంగా ఈ కేవైసీ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సైట్ ఓపెన్ చేసిన అనంతరం, కుడివైపున ఉండే ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది.


Also Read: Rythu Bharosa Scheme: ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.. జిల్లాల వారీ వివరాలివే.. ఓసారి చెక్ చేసుకోండి

అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే, మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేందుకు ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి. అప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే, ఈ కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఇంకా ఈకేవైసీ పై ఏవైనా సందేహాలు ఉంటే, తప్పనిసరిగా స్థానిక మీసేవ సెంటర్లను సంప్రదించాలని రైతన్నలను కేంద్రం కోరింది. మరి మీరు 19వ విడత పీఎం కిసాన్ నగదు కోసం వేచి ఉన్నారా.. ముందు ఈ కేవైసీ చేయించుకున్నారో లేదో చెక్ చేయండి. లేకుంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. ఈ ప్రక్రియకు ఈనెల 31వరకే గడువు.. మరచిపోవద్దు సుమా!

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×