India’s Vande Bharat Express vs UAE Bullet train: ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. చైనా లాంటి దేశాల్లో గంటకు 400 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు రూపొందుతున్నాయి. జపాన్ లాంటి దేశాల్లో బుల్లెట్ రైళ్లు తమ పౌరులకు సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE).. అబుదాబి, దుబాయ్ ని అనుసంధానించేలా కొత్త హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రకటించింది. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత వేంగా ప్రయాణించే టాప్ రైళ్లలో ఒకటిగా నిలువనుంది. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే UAE స్మార్ట్ రవాణాలో కీలక మైలురాయి కానుంది.
గంటకు 350 కిలో మీటర్ల వేగం
UAE ప్రకటించిన సరికొత్త హైస్పీడ్ బుల్లెట్ రైలు గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. ఈ కేవలం 30 నిమిషాల్లో 100 కి.మీ దూరాన్ని క్రాస్ చేస్తుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే మిడిల్ ఈస్ట్ రవాణా సదుపాయాలను మెరుగుపరచడంలో గణనీయంగా సాయపడనుంది. ఈ రైలు దుబాయ్ నుంచి అబుదాబికి కేవలం 30 నిమిషాల్లో ప్రయాణించనుంది. “ఈ బుల్లెట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుకు సంబంధించి టెండర్ల జారీ పూర్తయ్యింది. నెట్ వర్క్ డిజైన్ కు ఆమోదం లభించింది. హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టు పురోగతిలో ఉంది. ఈ ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది” అని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ బుల్లెట్ రైలు అనేక ముఖ్యమైన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాల గుండా వెళుతుంది. ప్రయాణీకులకు వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నది.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో పోల్చితే..
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన వందేభారత్ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో నడుస్తున్నది. త్వరలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అయితే, వందే భారత్ రైళ్లతో పోల్చితే UAE బుల్లెట్ రైలు గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఇండియన్ మేడ్ రైలుతో కంపార్ చేసినప్పుడు, UAE బుల్లెట్ రైలు రెట్టింపు వేగాన్ని కలిగి ఉంది.
Read Also: ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ పరుగులు..ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!
3 రోజుల UAE పర్యటనకు బయల్దేరని జైశంకర్
అటు గల్ఫ్ కంట్రీతో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(సోమవారం) UAE పర్యటనకు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. రెండు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగశాఖ వెల్లడించింది. “రెండు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని సమీక్షించడానికి, ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ UAE పర్యటనకు వెళ్లారు. అక్కడి ప్రభుత్వ పెద్దలతో సమాలోచనలు జరపనున్నారు” అని ప్రకటించింది.
Read Also: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?