BigTV English

Dwakra groups : ఇకపై మగవాళ్లకు డ్వాక్రా గ్రూప్స్.. ఏపీలో పురుషులకు మంచి రోజులు.. సీఎం చంద్రబాబు ఐడియా అదుర్స్..

Dwakra groups : ఇకపై మగవాళ్లకు డ్వాక్రా గ్రూప్స్.. ఏపీలో పురుషులకు మంచి రోజులు.. సీఎం చంద్రబాబు ఐడియా అదుర్స్..

Dwakra groups : గ్రామాల్లో పది, పదిహేను మంది మహిళలతో ఏర్పాటు చేసే డ్వాక్రా గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించిన ఈ కార్యక్రమం మూడు దశాబ్దాలుగా విజయవంతంగా అమలవుతోంది. ఇదే తరహాలో పురుషులకు సైతం గ్రూపులు ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించారు.. ఏపీ సీఎం చంద్రబాబు.  ఆయన సూచనలతోనే త్వరలోనే పురుషులకు ప్రత్యేక డ్వాక్రా గ్రూప్ లను ఏర్పాటు చేయనున్నారు.. ఆ వివరాలు మీకోసం..


చిన్నచిన్న ఇంటి అవసరాలకు, పంట ఖర్చులు, పిల్లల ఫీజులు సహా మిగతా చిన్న మొత్తాల కోసం అప్పుల ఊబిలో చిక్కుకోకుండా డ్వాక్రా సంఘాలు ఆదుకుంటున్నాయి. దాంతో పాటే.. నెలనెల కొద్ది మొత్తాలను అలవాటుగా పొదుపు చేసుకోవడమూ ఈ సంఘాల ద్వారానే అలవాటైంది. పైగా.. మహిళలు సంఘంగా ఏర్పడి.. అనేక ఇతర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే అవకాశాలు కలిగాయి. ఈ సంఘాలకు అతితక్కువ వడ్డీలకే బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పించడంతో పాటు.. నెలనెల తిరిగి చెల్లించే ఏర్పాటు చేశారు. దీంతో.. వారికి చాలా అవసరాలు తీరడంతో పాటు, అధిక అప్పుల బాధ నుంచి రక్షణ లభించింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 1995లో తొలిసారి ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగా.. ఇప్పుడు ఈ సంఘాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ముప్పై ఏళ్లుగా విజయవంతమైన ఈ ఫార్ములాను.. ఇప్పుడు పురుషులకు కూడా వర్తింపజేయాలని భావిస్తోంది  కూటమి ప్రభుత్వం. మహిళా సంఘాల తీరుగానే పురుషులతోనూ గ్రూపులు ఏర్పాటుచేసి రుణాలు ఇప్పించాలని, వారికి స్వయం ఉపాధి కోసం సహాయం చేయాలని భావిస్తోంది.


ఇటీవల కలెక్టర్లతో సమావేశం సందర్భంగా రుణ యాప్ ల విషయం చర్చకు వచ్చింది. అత్యవసరాలు, ఇతర చిన్న మొత్తాలకు పురుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో.. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవడం, రుణ యాప్ ల ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా నష్టోపోతున్నారని తెలిపారు. దీంతో.. వినూత్నంగా ఆలోచించిన సీఎం చంద్రబాబు.. డ్వాక్రా గ్రూప్ ల తరహాలోనే పురుషుల కోసం రుణాలు అందించే సంఘాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్నారు.

సీఎం ఆదేశాలతో అధికారులు ప్రయోగాత్మకంగా పురుషులకు సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా 20 గ్రూపులను ఏర్పాటు చేసిన అధికారులు.. ఆసక్తి ఉన్న వారిని సభ్యులుగా చేర్చి.. రుణాలు ఇప్పించారు.

బ్యాంకుల్లో రుణాలకు తలకు మించిన నిబంధలు ఉంటుండడం, రోజులు తరబడి తిరగాల్సి రావడంతో.. చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగులకు డబ్బులు లభించడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వాళ్లుక ఈ గ్రూప్ లు ఆర్థికంగా అండగా నిలుస్తాయని భావిస్తున్నారు.

పురుషులతో ఏర్పాటు చేయనున్న గ్రూప్ లను కామన్ ఇంట్రెస్టు గ్రూపుగా పిలవనున్నారు. ఇందులో.. చిన్నచిన్న ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులకు చోటు కల్పించనున్నారు. అంటే.. భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, వాచ్ మెన్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన వారిని సభ్యులుగా చేర్చనున్నారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యనున్న వారిని ఓ సంఘంగా ఏర్పాటు చేసి.. వీరికి బ్యాంకు రుణాలు ఇప్పించనున్నారు. వీటిని వాయిదాల పద్దతిలో.. నెల వారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

Also Read : అమ్మాయిలను ఎత్తుకుపోతున్న ఆగంతకులు, ఇప్పటివరకు 100.. విశాఖలో పట్టుబడ్డ ముఠా

ప్రస్తుతం అనకాపల్లిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గ్రూప్ ల ఏర్పాటు, తిరిగి చెల్లింపులను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రూప్ లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×