BigTV English

Prasad Behara : ప్రసాద్ బెహరా నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మరో నటి.. కారులోనే ఆ పని..

Prasad Behara : ప్రసాద్ బెహరా నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మరో నటి.. కారులోనే ఆ పని..

Prasad Behara : యూట్యూబర్ ప్రసాద్ బెహరా పేరు రెండు రోజులుగా హైలెట్ అవుతుంది. నటితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటుగా బూతులు మాట్లాడాటం మాత్రమే కాదు అసభ్యంగా తాకాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈయన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. ప్రసాద్ గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.. తాజాగా ప్రసాద్ గురించి మరో నటి సంచలన విషయాలను బయట పెట్టింది. ప్రసాద్ బెహరా‌కి సంబంధించిన మరో బాగోతం బయటకొట్టింది. అతనికి నోటి దూల చాలా ఎక్కువ అంటూ వైజాగ్ బ్యూటీ, తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్ వదిలింది. తన ఫస్ట్ సినిమా రిలీజ్ అప్పుడు.. అతను ఎంత గలీజ్ పని చేశాడో తన సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.


ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా లైంగిక వేధింపుల కేసులో నటి ఫిర్యాదు ఇవ్వడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది.. తాజాగా తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ అతని పై సోషల్ మీడియాలో ద్వారా షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అతనికి నోటి దూల చాలా ఎక్కువ. నా మొదటి సినిమా ‘కాలాయా తస్మై నమః’ రిలీజ్ అయిన రెండవ రోజు అది. నా నటన చాలా నేచురల్‌గా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అందులో నటించిన వాళ్ళందరం థియేటర్ దగ్గర ఉండి ప్రతి షోకి.. షో అయ్యాక థాంక్స్ చెప్తూ ఉన్నాము. నా మొదటి సినిమా కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను.. సినిమా బాగా వచ్చిందని ఇంట్లో పూజ చేసి డైరెక్టర్ కోసం పులిహోర బాక్స్ తీసుకొని వచ్చాను. అందరి ముందు నేను తినను అంటే మీ కారులో కూర్చొని తిందాం అని అన్నాను కారులో తినేసి బయటకు వచ్చాము..

ఆ మూవీలో నటిస్తున్న ప్రతి ఒక్కరు మేము కారులోంచి బయటకు రావడం చూశారు. మేమంతా కూడా మంచి ఫ్రెండ్స్. కానీ ఆ సినిమాలో ఒక చిన్న సైడ్ రోల్ చేసిన ఒక వ్యక్తి మాత్రం మరి ఏం అనుకున్నాడో ఎంటో తెలియదు. ఆ రోజు మా వైజాగ్ ఫిల్మ్ గ్రూప్స్‌లో ఇలా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు.. ఆ నోట్ లో ఒక తెలగు హీరోయిన్ డైరెక్టర్ తో కారులోనే ఆ పని కానిచ్చేసారు. వాడి మెసేజ్ చూడగానే అందరు షాక్ అయ్యారు. అతన్ని ప్రతిఒక్కరు తిట్టారు. ఇక మా టీమ్ మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో మళ్ళీ అవే గ్రూప్స్‌లో.. నేను బాగా తాగి అలా మెసేజ్ పెట్టాను. అది చాలా పెద్ద తప్పు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని మెసేజ్ పెట్టాడు… ఆ నోటి దూల వ్యక్తే హైదరాబాద్ కు వచ్చాడు యూట్యూబర్ గా బాగా పేరు సంపాదించుకున్నాడు. అదే దూల తో మొన్న అరెస్ట్ అయ్యాడు అని చెప్పింది. అరెస్టు అయ్యాడు అని న్యూస్ చదివినప్పుడు.. ఇతను ఏమీ మారలేదు ఇంకా అలానే ఉన్నాడు అనిపించింది.. అందుకే ఆమె నోటిదూల మనకే చెడు చేస్తుందని చెప్తుంది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×